
మన జీవనశైలిలో అలవాట్లు మొత్తం మారిపోతున్నాయి. ఎందుకంటే, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ పైన ఆధారపడుతున్నారు. వీటిని తినే కడుపు నింపుకుంటున్నారు.

అయితే, ఇలా తినడం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా, కొన్ని అనారోగ్య సమస్యలు అందర్ని పట్టి పీడిస్తున్నాయి. వాటిలో మలబద్ధకం సమస్య కూడా ఒకటి. దీని వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారు. కానీ, దీనిని అశ్రద్ధ చేస్తే లేని పోనీ సమస్యలు వస్తాయి.

మలబద్దకంతో తీవ్రంగా బాధపడే వారు పెరుగుతో ఇలా చేసుకుని తింటే.. ఆ సమస్య తగ్గుతుంది. ఎండుద్రాక్షలను పెరుగుతో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుందని వైద్యులు అంటున్నారు.

తయారీ విధానం: పెరుగు, ఎండుద్రాక్షను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేడి పాలను పోసి తోడు పెట్టాలి. దీన్ని ఇలాగే ఉంచండి. మరుసటి రోజు ఇది పెరుగుగా మారుతుంది. అలా మీరు దీనిని లంచ్ తో కానీ, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో కానీ తీసుకోండి.

మీరు ఇప్పటి వరకు మలబద్ధకం తగ్గడానికి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఉంటారు. అలాంటి వారికీ ఈ పెరుగు రెసిపీ మంచిది. కాబట్టి, పక్కా చేసుకుని తినండి. మీ సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది.