ఆకలి వేస్తుందంటే చాలా హోటల్ ముందు వాలిపోతాం.. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్‌లో తినాలంటే వీకెండ్ కోసం చూడటం లేదు. అప్పటి కప్పుడు ఆర్డర్ పెట్టుకోవడం.. అంతా కలిసి తినేయడం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా సందర్భాల్లో మనం రెస్టారెంట్ల నుంచి తెప్పించుకుని లాగిస్తుంటాం. మనం ఏ విషం మాట్లాడుకుంటున్నామో ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదులే.. ఇప్పుడు అసలు పాయింట్‌కు వచ్చేద్దాం.. మనం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వచ్చే ఫుడ్ ఓ బ్లాక్ బాక్సుల్లో నీట్‌గా ప్యాక్ చేసి మనం ఇంటి ముందుకు వచ్చి చేరుతుంది. అసలు అందులో వచ్చే ఆహారంతో సమస్య కాదు ఆ బ్యాక్సుతోనే అసలు సమస్య.. మీరు రెస్టారెంట్‌లో ఆహారాన్ని ప్యాక్ తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడల్లా.. మీరు తప్పనిసరిగా ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్‌ని మీ చేతిలో పెడుతారు. అందులో చాలా రెస్టారెంట్లు ఆహారాన్ని ప్యాక్ చేసి తమ కస్టమర్‌లకు అందిస్తాయి. కస్టమర్‌లు కూడా ఆందోళన లేకుండా వారి నుంచి ఈ బాక్స్‌ను తీసుకుంటారు.
ప్లాస్టిక్ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే ఆహార పదార్థాలను ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్లే ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్ మీ శరీరానికి, ఆరోగ్యానికి ఎంత హానికరమో ఎప్పుడైనా ఆలోచించారా..? రీసైక్లింగ్ సదుపాయంలో బ్లాక్ ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేయడం కష్టం. బ్లాక్ ప్లాస్టిక్ స్వభావం కారణంగా ఇది జరుగుతుంది. ప్లాస్టిక్ రెసిన్లకు కార్బన్ బ్లాక్ పిగ్మెంట్ జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ప్లాస్టిక్‌కు నలుపు రంగు వచ్చేలా పిగ్మెంట్ పనిచేస్తుంది. పెద్ద మొత్తంలో బ్లాక్ ప్లాస్టిక్‌ను కాల్చడం తయారు చేస్తారు. దీని వల్ల ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది.
పరిశోధన ప్రకారం, కార్బన్ బ్లాక్ పిగ్మెంట్ కారణంగా బ్లాక్ ప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా హానికరం. కార్బన్ బ్లాక్ ప్లాస్టిక్‌లో PAH అంటే పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్ ఉంటుంది. దీనిని క్యాన్సర్ కారకాలుగా ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ ( ఐఏఆర్సీ) పరిగణిస్తుంది. అంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. మీరు ఎప్పుడూ ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్‌లో ఆహారాన్ని తింటుంటే.. ఇప్పుడు ఈ రోజు నుంచి పూర్తిగా వదులుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాక్స్‌లో అనేక రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి.
బ్లాక్ బాక్స్‌లో చాలా హానికరమైన రసాయనాలు కనిపిస్తాయి. ఈ ప్లాస్టిక్ బాక్సులలో బిస్ ఫినాల్-ఎ, థాలేట్స్ వంటి కొన్ని రసాయనాలు ఉన్నాయని.. అవి అందులో ప్యాక్ చేసిన ఆహారంతో కలిసిపోతాయని అనేక అధ్యయనాలలో పేర్కొన్నారు. ఆహారం చాలా వేడిగా ఉంటే.. ఈ రసాయనాలు ఆ ఆహారంలో వెంటనే కరిగిపోతాయి. ఈ ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం