
ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనే పేరు వింటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా కోలుకోవడం కష్టంగా మారుతోంది. అయితే ప్రకృతి సిద్ధంగా మన ఇంట్లో లభించే కొన్ని సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మహమ్మారి దరిచేరకుండా చూసుకోవచ్చు.
పసుపు: పసుపులో ఉండే కుర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ కణాల విభజనను నిరోధిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పసుపు పాలు తాగడం వల్ల శరీరానికి రక్షణ లభిస్తుంది.
వెల్లుల్లి: శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో వెల్లుల్లిది అగ్రస్థానం. ఇది క్యాన్సర్ కణాలను అదుపులో ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అల్లం: శరీరంలో మంటను తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ వ్యాప్తిని అల్లం సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
టమాటా: వీటిలో ఉండే లైకోపీన్ అనే వర్ణద్రవ్యం ముఖ్యంగా పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. పచ్చి వాటికంటే ఉడికించిన టమోటాలు తీసుకోవడం వల్ల లైకోపీన్ శరీరానికి బాగా అందుతుంది.
తులసి: తులసి ఆకుల్లో ఉండే పాలీఫెనాల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
కేవలం ఆహారం మాత్రమే కాదు, మన అలవాట్లు కూడా క్యాన్సర్ ముప్పును నిర్ణయిస్తాయి.
పచ్చని కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీలలోని సల్ఫోరాఫేన్ కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది.
ప్లాస్టిక్ వద్దు: ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి ఆహారం తినడం లేదా వాటిని మైక్రోవేవ్‌లో ఉంచడం ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీనికి బదులుగా స్టీల్ లేదా గాజు పాత్రలను వాడటం సురక్షితం.
నార పదార్ధాలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని 80 శాతం వరకు నివారించవచ్చు.