Beauty: ఎంత ప్రయత్నించినా ముఖంపై మచ్చలు తగ్గడం లేదా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి

|

Aug 10, 2024 | 3:57 PM

అయితే మహిళలైనా, పురుషులైనా ప్రొడక్ట్స్‌ వాడడం మాత్రం సర్వసాధారణం. అయితే అందాన్ని పెంచేందుకు ఉపయోగించే ఆయింట్‌మెంట్స్‌ కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్‌ పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధమైన పద్ధతుల్లో కూడా నల్లటి మచ్చలను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ మచ్చలను దూరం చేసే ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Beauty: ఎంత ప్రయత్నించినా ముఖంపై మచ్చలు తగ్గడం లేదా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి
Beauty Tips
Follow us on

ప్రస్తుతం అందంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కేవలం మహిళలు మాత్రమే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం పురుషులు కూడా అందంపై దృష్టిసారిస్తున్నారు. ముఖంపై చిన్న మొటిమ వచ్చిందంటే చాలు వెంటనే తొలగించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. అంతేనా ఒక చిన్న మచ్చ ఏర్పడినా వెంటనే తొలగించుకోవడానికి రకరకాల ఆయింట్‌మెంట్స్‌ను వాడుతున్నారు.

అయితే మహిళలైనా, పురుషులైనా ప్రొడక్ట్స్‌ వాడడం మాత్రం సర్వసాధారణం. అయితే అందాన్ని పెంచేందుకు ఉపయోగించే ఆయింట్‌మెంట్స్‌ కొన్ని సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్‌ పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధమైన పద్ధతుల్లో కూడా నల్లటి మచ్చలను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ మచ్చలను దూరం చేసే ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నల్లటి మచ్చలను దూరం చేయడంలో ఆలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. నల్ల మచ్చలు ఉన్న చోట అలోవెరా జెల్‌ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

* వేప ఆకులు కూడా మచ్చలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకుల్లో క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బ్యాక్టీరియాను చంపడంతో పాటు, నల్లటి మొటిమలను దూరం చేస్తుంది. వేప ఆకులను పేస్ట్‌ చేసి, మొటిమలపై అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.

* తేనె యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు పెట్టింది పేరు. ఇది నల్ల మచ్చలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలున్న చోట రాత్రి పడుకునే సమయంలో తేనెను అప్లై చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు ఇట్టే దూరమవుతాయి.

* ముఖంపై ఉండే మచ్చలను దూరం చేయడంలో పెరుగు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని శుభ్రపరిచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగును ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేసి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చూస్తే మచ్చలు తగ్గిపోతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. కొంత మంది చర్మంపై ఇలాంటివి అప్లై చేసిన సమయంలో అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఉపయోగించే సమయంలో ముందుగా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..