
గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును తొలగించడానికి వైద్య పరిభాషలో కూడా కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతుంటారు. గట్టిగా దగ్గడం నుండి అరటిపండు మింగడం వరకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి గొంతు కండరాలను సడలించి, ఎముకను జీర్ణవ్యవస్థలోకి పంపడానికి సహాయపడతాయి. అయితే, ఈ ప్రయత్నాలన్నీ చేసినా నొప్పి తగ్గకపోతే మాత్రం వైద్య సహాయం తప్పనిసరి. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చేప ముల్లును తొలగించే చిట్కాలు:
బలమైన దగ్గు: గొంతులో ముల్లు ఇరుక్కున్నట్లు అనిపించినప్పుడు మొదటగా గట్టిగా దగ్గడానికి ప్రయత్నించండి. ఆ దగ్గు వల్ల కలిగే ఒత్తిడికి ముల్లు ఊడి బయటకు వచ్చే అవకాశం ఉంది.
ముద్దగా ఉన్న అన్నం: కొద్దిగా అన్నాన్ని ముద్దగా చేసుకుని, నమలకుండా నేరుగా మింగడానికి ప్రయత్నించండి. ఆ అన్నం బరువుకు ముల్లు కూడా కలిసి కడుపులోకి జారిపోతుంది.
అరటిపండు: పెద్ద అరటిపండు ముక్కను నోట్లో పెట్టుకుని అది మెత్తగా అయ్యాక ఒకేసారి మింగండి. అరటిపండుకున్న జిగురు స్వభావం వల్ల ముల్లు దానితో పాటు లోపలికి వెళ్ళిపోతుంది.
గోరువెచ్చని నీరు: గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగడం వల్ల గొంతు కండరాలు సడలి, ముల్లు కిందికి జారడానికి మార్గం సుగుమం అవుతుంది.
తేనె: రెండు చెంచాల తేనెను నేరుగా మింగడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. తేనెలోని చిక్కదనం ముల్లును తనతో పాటు తీసుకెళ్తుంది.
సాఫ్ట్ డ్రింక్స్: కోక్ లేదా పెప్సి వంటి కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అయి, ఆ ఒత్తిడికి ముల్లు కదిలే అవకాశం ఉంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన పేర్కొన్న పద్ధతులు పాటించినా నొప్పి తగ్గకపోయినా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.