Coronavirus Pandemic : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన ఎక్కువగా వృద్ధులు, స్థూలకాయం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు , దీర్ఘకాలిక గుండె లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఈ వైరస్ బారిన పడుతున్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక కొత్త అధ్యయనం మరొక ప్రమాద కారకాన్ని వెల్లడించింది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల సరిగ్గా లేని వారు.. అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్న మహిళలు COVID-19 బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు పిసిఒఎస్ తో బాధపడుతున్న మహిళల్లో 50 శాతం ఎక్కువగా కరోనా బారినపడే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) అనేది పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో సాధారణమైన హార్మోన్ల రుగ్మత. మహిళల అండాశయాల్లో తిత్తులు అభివృద్ధి చెందుతాయి. ఇది వంధ్యత్వానికి కూడా దారితీస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు మహిళలు బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు రావడం, రుతుక్రమంలో మార్పులు. ఇటీవల పిసిఒఎస్ తో బాధపడుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. అధికారిక సమాచారం ప్రకారం, హార్మోన్ల పరిస్థితి భారతదేశంలో 20 శాతం మహిళలు ఈ పిసిఒఎస్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం పిసిఒఎస్‌తో బాధపడుతున్న మహిళల్లో 50 శాతం మంది కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారని తెలుస్తోంది.
పిసిఒఎస్‌తో పాటు టైప్ 2 డయాబెటిస్.. కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా COVID-19 క సోకడానికి కారకరాలుగా మారుతున్నాయని గుర్తించారు. ఈ వ్యాధులతో బాధపడే మహిళల కరోనా బారిన పడితే జీవ క్రియ తోపాటు ఆరోగ్య పరిస్థితులు తీవ్రతను పెంచుతున్నాయి.
పిసిఒఎస్ ఉన్న మహిళలకు COVID-19 ప్రమాదాన్ని పెంచుతుందా అనే విషయంపై బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం జనవరి మరియు జూలై 2020 మధ్య ఓ అధ్యయనం నిర్వహించింది. 21,292 మంది మహిళలపై ఈ అధ్యయనం చేయగా.. పిసిఒఎస్ తో ఒకే వయస్సు ఉన్న మహిళల్లో పిసిఒఎస్ లేని వారితో పోల్చితే కోవిడ్ -19 సంక్రమించే ప్రమాదం 51 శాతం ఎక్కువ అని తేలింది.
అయితే తమ అధ్యయనంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని మాత్రమే అంచనా వేసిందని .. తీవ్ర మాత్రం తెలియదని పరిశోధకులు స్పష్టం చేశారు. అందుకని కోవిడ్ 19 తీవ్రత, దీర్ఘకాలిక సమస్యలను తెలుసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకని మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న మహిళలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు, అటువంటి మహిళలు అందుబాటులో ఉన్న టీకాలు వేయాలని సూచిస్తున్నారు.
Also Read: ఏపీ కొత్త ఎస్ఈసీ ఎవరు..? గవర్నర్‌కు మూడు పేర్లు సిఫార్సు ప్రభుత్వం.. వారు ఎవరంటే..?