Coronavirus Masks: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!

|

Apr 19, 2021 | 10:45 AM

Coronavirus Masks: ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితం కరోనా కి ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిలో మనదేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ .. నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు...

Coronavirus Masks: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!
Coroona Virus Mask
Follow us on

Coronavirus Masks: ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితం కరోనా కి ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదిలో మనదేశంలో వెలుగు చూసిన కరోనా వైరస్ .. నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ అదుపులోకి వచ్చినట్లు వచ్చిన కరోనా మళ్ళీ ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ లో రోజు రోజుకీ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని.. శానిటైజ్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మాస్కులను రోజుకి ఒకటి చొప్పున వాడడానికి సామాన్యుడికి ఇబ్బంది. అందుకనే ఎక్కువగా కాటన్ క్లాత్ తో ఇంట్లోనే తయారు చేసుకున్న మాక్సులను ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు.

కాటన్ క్లాత్‌తో ఇంట్లోనే మాస్కులను తయారుచేసుకుని వాడుకుంటున్నారు. ఇలా మాస్కులను తయారుచేసుకోవడం సులభమే.. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడమే కష్టం.. అయితే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.. వాటిని రోజూ తప్పనిసరిగా ఉతుక్కోవాలని చెబుతున్నారు టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ఆరోగ్య నిపుణులు.. ” మాస్కులను వేడినీటితోనే ఉతకాలి” మాస్కులను సబ్బుతో కంటే.. బ్లీచ్ వాటర్‌లో నానబెట్టి ఉతికితే హానికర సూక్ష్మజీవులు చనిపోతాయి.” మాస్కు ఉతికిన తరువాత డెట్టాల్” వేసిన నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఎండ బాగా తగిలే చోట ఆరేయాలి. “ఉతికిన మాస్కులను ఐరన్ చేసి” ఉపయోగించాలి.

 

Also Read: మహిళల్లో పీసీ ఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యలు వేధిస్తున్నాయా.. నివారణకోసం ఈ ఆసనాన్ని ట్రై చేయండి