వినూత్న కార్యక్రమం చెపట్టిన అమ్మాయిలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెస్సులు.. ఆకట్టుకుంటున్న ‘ట్రాషన్ షో’..

|

Apr 27, 2021 | 4:22 PM

ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యం ఆ యువతుల మనసును కదిలించాయి. కాలుష్యంతో ఏర్పడే సమస్యల గురించి

వినూత్న కార్యక్రమం చెపట్టిన అమ్మాయిలు.. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెస్సులు.. ఆకట్టుకుంటున్న ట్రాషన్ షో..
Neigerian Girls
Follow us on

ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యం ఆ యువతుల మనసును కదిలించాయి. కాలుష్యంతో ఏర్పడే సమస్యల గురించి ప్రపంచ పర్యావరణ వేత్తల ఆందోళనను ఆ నేజిరియా యువతులను తాకాయి. దీంతో వారు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నడుం బిగించారు. వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్యాషన్ బుల్ డ్రెస్సులు, బ్యాగులు రూపొందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నైజీరియాకు చెందిన 15 ఏళ్ల ఎసోహి ఒజిగ్బో ‘ట్రాషన్‌ షో’ ద్వారా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఎలా నివారించవచ్చనే విషయాన్ని చెబుతుంది.

నైజీరియాలోని లాగోస్‌ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓ కార్యక్రమం చేపట్టారు. చెత్తడబ్బ, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను జాగ్రత్తలు పాటిస్తూ సేకరించి, ఉపయోగపడే వస్తువులు, ఫ్యాషనబుల్‌ దుస్తులను తయారు చేస్తున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల డ్రస్‌లను ‘గ్రీన్‌ ఫింగర్స్‌ వైల్డ్‌ లైఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ట్రాషన్‌ షో’ పేరిట ప్రదర్శించారు. వినూత్న ఐడియాతో వీరు రూపొందించిన ఈ ప్లాస్టిక్‌ వస్త్రాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ షోలో ఫ్యాషన్ డ్రెస్సుల మాదిరిగానే ప్లాస్టిక్ వ్యర్థాలతో రంగురంగుల షాపింగ్ బ్యాగ్స్, చెత్తడబ్బల వంటి వాటినీ తయారు చేసి షాపింగ్‌ మాల్స్‌ వద్ద విక్రయిస్తున్నారు. ఇక ఈ విషయం పై ఒజిగ్బో.. ప్లాస్టిక్‌ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్‌ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్‌ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ.. మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా ఉన్నాయి. . రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాం. ఈ క్రమంలోనే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను సేకరించి .. శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాబ్రిక్‌ తో కలిపి కుట్టి మోడల్‌ వస్త్రాలు, బ్యాగులు రూపొందిస్తున్నాం. మేము రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్‌ షో మంచి వేదిక అయింది. మేమంతా టీనేజర్లం.. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి మాలో ఉంది. అందుకే స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌ బర్గ్‌ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్నాము’’ అని చెప్పారు.

 

Also Read: Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..