Face Pack: ముఖంపై మొటిమలు, జిడ్డుతో ఇబ్బందా? 15 నిమిషాల్లో పార్లర్‌‌కు వెళ్లిన గ్లో!

వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముల్తానీ మట్టి కంటే కూడా వేప ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఖరీదైన కాస్మెటిక్స్ ఇచ్చే మెరుపు తాత్కాలికం, కానీ వేప వంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులు ఇచ్చే అందం శాశ్వతం. ఈ చిన్న చిట్కాలతో మీ చర్మ సమస్యలకు స్వస్తి పలికి, ఆరోగ్యకరమైన మెరుపును సొంతం చేసుకోండి.

Face Pack: ముఖంపై మొటిమలు, జిడ్డుతో ఇబ్బందా? 15 నిమిషాల్లో పార్లర్‌‌కు వెళ్లిన గ్లో!
Neem Face Pack.jpg

Updated on: Mar 21, 2026 | 6:50 AM

నేటి ఉరుకుల పరుగుల జీవితం, కాలుష్యం మరియు మారిన ఆహారపు అలవాట్ల వల్ల చర్మం తన సహజ సిద్ధమైన మెరుపును కోల్పోయి నిర్జీవంగా మారుతోంది. ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, జిడ్డు పేరుకుపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. మార్కెట్‌లో దొరికే రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడే కంటే, మన ఇంటి పెరట్లోనే దొరికే ‘వేప’తో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఆయుర్వేదంలో వేపకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చర్మ సౌందర్యంలో వేప చేసే మ్యాజిక్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ప్రయోజనాలు..

  • మొటిమల నివారణ‌‌ : వేపలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వేర్లతో సహా నశింపజేస్తాయి.
  • జిడ్డు నియంత్రణ : జిడ్డు చర్మం ఉన్నవారికి వేప ఒక వరం. ఇది చర్మంపై అదనంగా చేరే సెబమ్‌ను నియంత్రించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.
  • ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ : చర్మంపై వచ్చే దురద, ఎర్రబారడం మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో వేప సాటిలేనిది.
  • నేచురల్ గ్లో : చర్మంలోని మలినాలను తొలగించి, స్కిన్ టోన్‌ను సమానంగా మారుస్తుంది.

ఇలా వాడండి..

  • సాధారణ చర్మం కోసం : తాజా వేప ఆకుల పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
  • మొటిమలు ఎక్కువగా ఉన్నవారు : వేప పేస్ట్‌లో రెండు చెంచాల పెరుగు కలిపి ప్యాక్ వేసుకోండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మొటిమల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • పొడి చర్మం ఉన్నవారు : వేప పేస్ట్‌లో ఒక చెంచా తేనె కలపండి. ఇది చర్మానికి తేమను అందించి మెరిసేలా చేస్తుంది.
  • తక్షణ మెరుపు కోసం : వేప పొడి లేదా పేస్ట్‌లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. 20-30 నిమిషాల తర్వాత కడిగితే ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేప చాలా శక్తివంతమైనది, కాబట్టి దీనిని వారానికి రెండు సార్లు మాత్రమే వాడటం మంచిది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా చేతిపై ‘పాచ్ టెస్ట్’ చేసుకోవాలి. అలాగే, కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి దీనిని అప్లై చేయకండి.

Follow Us