Ginger for Hair: డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా..? అల్లంతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే..?

|

Apr 04, 2022 | 9:02 AM

Ginger for Hair and Dandruff: వేసవిలో దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టులో మురికి ఏర్పడి చుండ్రు, పలు సమస్యలు వస్తాయి. దీనివల్ల తలపై దురద సమస్య కూడా బాగా పెరుగుతుంది.

Ginger for Hair: డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారా..? అల్లంతో చెక్ పెట్టవచ్చు.. ఎలాగంటే..?
Hair Care
Follow us on

Ginger for Hair and Dandruff: వేసవిలో దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టులో మురికి ఏర్పడి చుండ్రు, పలు సమస్యలు వస్తాయి. దీనివల్ల తలపై దురద సమస్య కూడా బాగా పెరుగుతుంది. వాస్తవానికి చుండ్రుకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అయితే.. అధిక పొడి స్కాల్ప్ కాకుండా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఇతర కారణాల వల్ల కూడా చుండ్రు సమస్య వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. జట్టు సమస్యలు, డాండ్రఫ్ సమస్యను ఎదుర్కొనే వారు అల్లంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అల్లంను జుట్టుకు వివిధ రకాలుగా ఉపయోగించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అల్లంను జుట్టుకు ఎలా అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

నూనె – అల్లం: అల్లం రసాన్ని జట్టుపై ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే.. మీ స్కాల్ప్ స్కిన్ సెన్సిటివ్‌గా ఉండి అల్లం రసాన్ని నేరుగా అప్లై చేయడం ద్వారా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు దానిని నూనెగా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీరు కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి కొన్ని చుక్కల అల్లం ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయండి. అంతే కాకుండా అల్లం తురుము వేసి ఏదైనా హెయిర్ ఆయిల్‌లో మిక్స్ చేయవచ్చు. ఈ ఆయిల్‌ను క్రమం తప్పకుండా వాడితే చుండ్రు సమస్య తొలగిపోతుంది.

జట్టును శుభ్రం చేస్తుంది: హెయిర్ రిన్స్ కూడా అల్లం సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఇది మీ జుట్టుకు మెరుపును జోడించడమే కాకుండా చుండ్రుకు కూడా చికిత్స చేస్తుంది. దీని కోసం ఒక కప్పు బియ్యం నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడ్ వెనిగర్, అల్లం రసం వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి నీటితో శుభ్రం చేసుకోవాలి.

షాంపూ: మీరు చాలా సులభమైన.. సురక్షితమైన మార్గంలో మీ జుట్టు లేదా తలపై అల్లం అప్లై చేయాలనుకుంటే ఈ పద్ధతి ఉత్తమమైనది. దీని కోసం కొద్దిగా సల్ఫేట్ లేని షాంపూ.. ఒక చెంచా అల్లం రసం కలపాలి. ఈ షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. దీనివల్ల చుండ్రు పోవడమే కాకుండా.. పలు సమస్యలను తొలగించి జుట్టును శుభ్రపరుస్తుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది.

Also Read:

Lipstick Side Effects: లిప్‌స్టిక్‌ ఎక్కువగా వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

Ghee Benefits: వేసవిలో నెయ్యి తినడం మానేస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి