Eye Care Tips: కళ్ళను అలెర్జీ సమస్యల నుంచి రక్షణ కోసం రోజూ ఈ అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..

కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి రోజూవారీ అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాదు అలెర్జీల నుంచి రక్షిస్తాయి. కంటి అలెర్జీలు, కంటి చూపు సరిగా లేకపోవడం మొదలైన వాటి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వీటిని మనం తరచుగా విస్మరిస్తాము. అయితే మీ దినచర్యలో కొన్ని చిన్న, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Eye Care Tips: కళ్ళను అలెర్జీ సమస్యల నుంచి రక్షణ కోసం రోజూ ఈ అలవాట్లు దినచర్యలో చేర్చుకోండి..
Eye Care Tips
Image Credit source: unsplash

Updated on: Oct 04, 2025 | 10:46 AM

మారుతున్న వాతావరణం ప్రభావం కంటి ఆరోగ్యంపై చూపిస్తుంది. కళ్ళు జిగురుగా ఉండటం, ఎరుపుగా ఉండటం, కళ్ళు నీళ్ళు కారడం, దురద వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు ఈ రోజుల్లో చిన్న వయసులోనే కంటి చూపు మందగించడం చాలా సర్వ సాధారణం అయిపోయింది. ఎందుకంటే ప్రజల జీవనశైలిలో మార్పుల వలన అంటే ఆహారపు అలవాట్లలో మార్పు కూడా కారణం కావచ్చు. మన కళ్ళపై మాత్రమే కాదు మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అనేక చెడు అలవాట్లు ఉన్నాయి. ఈ రోజు కళ్ళను అలెర్జీల నుంచి రక్షించడానికి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొన్ని మంచి అలవాట్ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

కళ్ళు మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం. కనుక కాళ్ళ ఆరోగ్యం పట్ల కొంచెం అదనపు జాగ్రత్త అవసరం. అయితే మనం తరచుగా వాటిని నిర్లక్ష్యం చేస్తాము. అస్పష్టమైన దృష్టి, నిరంతర తలనొప్పి, కంటిలో ఒక వైపు నొప్పి లేదా కంటి ఒత్తిడి వంటి సమస్యలు ఎదురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పరిశుభ్రత పాటించండి
కంటి అలెర్జీలను నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. కళ్ళను పదే పదే తాకవద్దు. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది లేదా కంటి సమస్యను తీవ్రతరం చేస్తుంది. కనుక బ్యాక్టీరియా కళ్ళలోకి రాకుండా నిరోధించడానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ లేదా బయట దుమ్ము ఎగురుతుంటే.. ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండండి లేదా కళ్ళ జోడుని ధరించండి.

ఇవి కూడా చదవండి

అలెర్జీ ఉంటే ఏమి చేయాలి
కళ్ళలో జిగట, దురద, పొడిబారడం వంటి ఏవైనా సమస్యలు ఎదురవుతుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో పాటు.. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు మంచి సన్ గ్లాసెస్ ధరించండి.

20-20-20 నియమం
రోజంతా కూర్చుని కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే.. 20-20-20 నియమాన్ని పాటించండి. ఈ రోజుల్లో ఎక్కువసేపు స్క్రీన్ సమయం సర్వసాధారణం.. దీంతో కంటికి ఒత్తిడి వస్తుంది. 20 సెకన్లు అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం.. ఈ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టి పెట్టండి. ఇంకా పని పూర్తి చేసిన తర్వాత ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

సూర్యకాంతి నుంచి రక్షణ
ప్రజలు తరచుగా తమ చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకుంటారు. తమ కళ్ళను నిర్లక్ష్యం చేస్తారు. UV కిరణాలు మీ కళ్ళకు కూడా హాని కలిగిస్తాయి. కనుక మీరు ఎండలో బయటకు వెళ్ళినప్పుడల్లా UV రక్షణ సన్ గ్లాసెస్ ధరించాలి.

మంచి నిద్ర
మంచి దినచర్య అలవాట్లతో పాటు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం. మీ కళ్ళు తాజాగా ఉండటానికి, ఉదయం బరువుగా అనిపించకుండా ఉండటానికి రాత్రి సమయంలో మంచి నిద్రపోవాలి. అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండవద్దు.

తినే ఆహారాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోండి. ఇవి విటమిన్ ఎ కి మూలం. అనేక ఇతర పోషకాలను అందిస్తాయి. అలాగే బాదం, వాల్‌నట్స్, చేపలు , గుడ్లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. క్యారెట్లు, బెల్ పెప్పర్స్, చిలగడదుంపలు కూడా కెరోటిన్, అనేక విటమిన్లు అధికంగా ఉండే కూరగాయలు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)