Hair Tips: వర్షాకాలంలో హెయిర్ ఫాల్.. తడి జుట్టును దువ్వడం మంచిదేనా.. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ కోసం

|

Aug 18, 2022 | 7:21 AM

వర్షాకాలం (Raining).. అసలే వ్యాధులు ముసిరే కాలం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే ఈ కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి సమస్య జుట్టు రాలిపోవడం. అందరూ వర్షంలో తడుస్తూ ఆనందాన్ని ఆస్వాదించినా అది త్వరలోనే మాయం..

Hair Tips: వర్షాకాలంలో హెయిర్ ఫాల్.. తడి జుట్టును దువ్వడం మంచిదేనా.. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ కోసం
Hair Care Tips
Follow us on

వర్షాకాలం (Raining).. అసలే వ్యాధులు ముసిరే కాలం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే ఈ కాలంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి సమస్య జుట్టు రాలిపోవడం. అందరూ వర్షంలో తడుస్తూ ఆనందాన్ని ఆస్వాదించినా అది త్వరలోనే మాయం అయిపోతుంది. ఎందుకుంటే వానలో తడిసిన తర్వాత జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది.జుట్టు చిట్లడం, పొడిగా మారడం, మెరుపును కోల్పోవడం, చుండ్రు, దురద స్కాల్ప్‌ సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలన్నీ జుట్టు రాలడానికి సంకేతాలు. జుట్టుకు (Hair) కేర్ రొటీన్‌గా నూనె రాసుకోవడం మంచి పద్ధతి. ఇది వెంట్రుకలను కండిషన్ గా చేస్తుంది. వారానికి రెండుసార్లు షాంపూ చేయడానికి ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. డ్యామేజ్‌ను రిపేర్ చేసేందుకు స్మూత్‌గా, సిల్కీగా మార్చేందుకు కలబంద, గ్రీన్ టీ ఉత్పత్తుల నూనెలను ఎంచుకోవాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి స్పా ట్రీట్‌మెంట్ అందిస్తుంది. దెబ్బతిన్న జుట్టుకు చికిత్స చేయడానికి పాటించే మార్గాల్లో ఇది అత్యుత్తమమైనది. ఇలా చేయడం ద్వారా జుట్టు సామర్థ్యం పెరగడమే కాకుండా రక్త ప్రసరణ, జుట్టు పెరుగుదలను వేగవంతం అవుతుంది.

హార్డ్ వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా వర్షాకాలంలో నీటి నాణ్యత తగ్గుతుంది. ఇది జుట్టుకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి మంచినీటితో మాత్రమే తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. బ్లో-డ్రైయింగ్‌కు బదులుగా టవల్-డ్రై పద్ధతిని ఉపయోగించాలి. జుట్టును టవల్‌తో ఆరబెట్టడం ఉత్తమ మార్గం. ఇది కురులను త్వరగా పొడిగా మారుస్తుంది. తడి జుట్టును దువ్వే బదులు, 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తల దువ్వుకోవాలి. తడి జుట్టును దువ్వితే వెంట్రుకలు అధికంగా రాలిపోతాయి. వెడల్పాటి టూత్ దువ్వెన, పచ్చ దువ్వెన లేదా చెక్క దువ్వెనను ఉపయోగించే ముందు జుట్టును టవల్‌తో ఆరబెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..