చియా సీడ్స్ ఇప్పుడు సూపర్‌ఫుడ్ స్టార్‌లా మారాయి. సోషల్ మీడియాలో చూసి చియా సీడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని, తమ అభిమాన నటులు సూచిస్తున్నారని చాలామంది చియా సీడ్స్ తినడం అవకాటు చేసుకుంటున్నారు. చియా పుడ్డింగ్, స్మూతీ బౌల్స్, ఓట్స్‌లో కలిపి… అందరూ ఒమేగా-3, ఫైబర్ ..
చియా సీడ్స్ ఇప్పుడు సూపర్‌ఫుడ్ స్టార్‌లా మారాయి. సోషల్ మీడియాలో చూసి చియా సీడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని, తమ అభిమాన నటులు సూచిస్తున్నారని చాలామంది చియా సీడ్స్ తినడం అవకాటు చేసుకుంటున్నారు. చియా పుడ్డింగ్, స్మూతీ బౌల్స్, ఓట్స్‌లో కలిపి… అందరూ ఒమేగా-3, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అంటూ సంబరపడిపోతున్నారు. చియాలో పోషకాలు ఉండేది నిజమే!
కానీ రోజూ 40–50 గ్రాములు (3–4 టేబుల్ స్పూన్లు) కంటే ఎక్కువ తింటే మీ శరీరం వాటిలోని పోషకాలను శోషించుకోలేదు. మోతాదుకు మించి చియా సీడ్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
*ఒక టేబుల్ స్పూన్ (12 గ్రా) చియా సీడ్స్‌లోనే 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒకేసారి 50 గ్రాములు తింటే 20 గ్రాముల ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఇది మన రోజువారీ శరీరానికి అవసరమైన (25–30 గ్రా) మోతాదుని దాటేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఒక్కసారిగా వెళ్తే పొట్టలో గ్యాస్, ఉబ్బరం, తీవ్రమైన నొప్పి వస్తుంది.
నీళ్లు తక్కువ తాగితే చియా సీడ్స్ పొట్టలో ఉన్న నీటిని పీల్చుకుని మలాన్ని గట్టిగా చేస్తాయి. తద్వార మలబద్ధక సమస్య పెరుగుతుంది. నీళ్లు ఎక్కువ తాగితే ఒక్కసారిగా ఫైబర్ ఎక్కువై విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది.
చియా సీడ్స్‌లో ఒమేగా-3, పొటాషియం ఎక్కువ. బ్లడ్ ప్రెషర్ మందులు వాడేవాళ్లు ఎక్కువ తింటే పొటాషియం లెవెల్ ఒక్కసారిగా పెరిగి హైపర్‌కలీమియా వచ్చే రిస్క్ ఉంటుంది. ఒమేగా-3 ఎక్కువగా ఉండటంతో బ్లడ్ థిన్నర్స్ అయిన వార్ఫరిన్, ఆస్పిరిన్ వాడేవాళ్లకి బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది.
చియా సీడ్స్ నీళ్లు తాగకుండా పొడిగానే మింగితే 1:10 నిష్పత్తిలో ఉబ్బుతాయి. గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడకపోవచ్చు. కొందరిలో చియా సీడ్స్ అలర్జీ ఉంటుంది. నోట్లో దురద, శరీరంపై ర్యాషెస్, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
పెద్దలు రోజుకి 1–2 టేబుల్ స్పూన్లు (15–25 గ్రాములు) మాత్రమే తీసుకుంటే మంచిది. అంతకంటే ఎక్కువ కావాలంటే క్రమంగా పెంచాలి, తప్పకుండా 2–3 లీటర్ల నీళ్లు తాగాలి.
చియా సీడ్స్ మన ఆరోగ్యానికి మంచివే, కానీ ‘ఎక్కువ మంచి కూడా చెడు’ అన్న సూక్తి దీనికీ వర్తిస్తుంది. మోడరేషన్‌లో తింటే సూపర్‌ఫుడ్… అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఫుడ్!
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.