రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. తినే సరైన విధానం తెలుసుకోండి!

వేసవిలో పుచ్చకాయ, మామిడి పండ్లతో పాటు అందరి దృష్టిని ఆకర్షించే పండ్లు తియ్యటి లిచీ. ఈ వేసవి పండు తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు దండిగా ఉంటాయి. లిచీలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అందుకే 8 నుండి 80 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఈ వేడిలో లిచీ తినేందుక ఇష్టపడతారు..

రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. తినే సరైన విధానం తెలుసుకోండి!
Diabetes And Lychee

Updated on: May 27, 2026 | 1:17 PM

లిచీని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా? ముఖ్యంగా మీరు ఖాళీ కడుపుతో లీచీ తినడం లేదంటే ఒకేసారి ఎక్కువగా లిచీ తింటే శరీరంపై తీవ్రమైన హానికర ప్రభావాలను కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం లిచీలో మన రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేసే కొన్ని సహజ పదార్థాలు ఉంటాయి. దీని ఫలితంగా ఆకస్మిక నీరసం, తల తిరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ లిచీ అసలైన రుచిని, ప్రయోజనాలను పొందాలంటే దానిని ఎప్పుడు, ఎంత పరిమాణంలో, ఎలా తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువగా లిచీ పండ్లు తింటే ఏం జరుగుతుంది?

ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. లిచీ పండ్లను మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదని అన్నారు. అయితే సూచించిన దానికంటే ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లిచీ తినడం అత్యంత ప్రమాదకరం. దీనివల్ల శరీరంలో అకస్మాత్తుగా తీవ్రమైన నీరసం, తలనొప్పి, కళ్లు తిరగడం, తీవ్రమైన అలసట వంటివి కలగవచ్చు. అంతేకాకుండా అధికంగా లిచీ తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, విరేచనాలు, చర్మ అలెర్జీల వంటి సమస్యలు తలెత్తుతాయి.

లిచీ పండు తినడానికి సరైన నియమం ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం లిచీ పండ్లను ఎల్లప్పుడూ మితంగానే తినాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు గరిష్టంగా 8 నుండి 10 లిచీ పండ్లను తినవచ్చు. అలాగే తినే ముందు లిచీ పండ్లను నీటితో శుభ్రంగా కడగడం ముఖ్యం. దీనివల్ల వాటి తొక్కలో ఉండే రసాయనాలు, సూక్ష్మక్రిములు కడుపులోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఉదయం పూట గానీ లేదా మరే ఇతర సమయంలోనైనా ఖాళీ కడుపుతో లిచీ పండ్లను ఎప్పుడూ తినకూడదు. ఈ నియమాన్ని పిల్లల విషయంలో ఖచ్చితంగా పాటించాలి. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని లిచీ పండ్లను వెంటనే తినవద్దు. ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసిన తర్వాత దానిని కాసేపు బయట ఉంచి, సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత మాత్రమే తినాలి.

ఇవి కూడా చదవండి

లిచీకి ఎవరు దూరంగా ఉండాలి?

కొన్ని శారీరక సమస్యలు ఉన్నవారు లిచీ పండ్లకు దూరంగా ఉండటం మంచిది. లేదా వాటిని తినే ముందు వైద్యులను సంప్రదించాలి

  • మధుమేహం లేదా అధిక రక్త చక్కెరతో బాధపడేవారు.
  • ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు (హైపోగ్లైసీమియా).
  • వివిధ రకాల ఆహార పదార్థాలకు త్వరగా అలర్జీ వచ్చే వారు.
  • బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారు లేదా తరచుగా కడుపు నొప్పితో బాధపడేవారు లిచీ పండ్లకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us