Diabetes Control Tips: ఈ గింజలు తింటే.. మీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వక తప్పదు..

ప్రస్తుత కాలంలో ఎవర్ని కదిపినా ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతూనే ఉంటున్నారు. అందులోనూ డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య ఇంకా పెరిగింది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం బాధ పడక తప్పదు. లైఫ్ లాంగ్ షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. షుగర్ వచ్చిందంటే నచ్చిన ఆహారమే కాదు.. ఏ ఆహారం కూడా తినడానికి ఉండదు. డయాబెటీస్‌తో అంత డేంజర్. కాబట్టి షుగర్ రాకుండా..

Diabetes Control Tips: ఈ గింజలు తింటే.. మీ షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వక తప్పదు..
Diabetes Control Tips
Follow us

|

Updated on: Jun 08, 2024 | 4:44 PM

ప్రస్తుత కాలంలో ఎవర్ని కదిపినా ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతూనే ఉంటున్నారు. అందులోనూ డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య ఇంకా పెరిగింది. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం బాధ పడక తప్పదు. లైఫ్ లాంగ్ షుగర్‌ను కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. షుగర్ వచ్చిందంటే నచ్చిన ఆహారమే కాదు.. ఏ ఆహారం కూడా తినడానికి ఉండదు. డయాబెటీస్‌తో అంత డేంజర్. కాబట్టి షుగర్ రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే వచ్చిన వాళ్లు సరైన డైట్ ఫాలో చేస్తే.. షుగర్ పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు సరికొత్త టిప్స్‌తో మీ ముందుకు వచ్చేశాం. ఇవి కూడా మీకు చక్కగా హెల్ప్ చేస్తాయి.

దానిమ్మ గింజలు:

దానిమ్మ గింజల్లో సహజంగానే తీపి ఉంటుంది. సాధారణంగా ఇవి తింటే షుగర్ పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ ఓ చిన్న కప్పు దానిమ్మ గింజలు తీసుకోండి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.

అవిసె గింజలు:

షుగర్‌ని కంట్రోల్ చేయడంలో అవిసె గింజలు ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటిల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

చియా సీడ్స్:

చియా విత్తనాలు తీసుకోవడం వల్ల కూడా మీ షుగర్ లెవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మెంతులు:

మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు ఎంతో చక్కగా సహాయ పడతాయి. షుగర్ ఉన్నవారు ప్రతి రోజూ రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది.

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కూడా డయాబెటీస్‌ నియంత్రణలోకి వస్తుంది. వీటిల్లో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. వీటిని మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదే విధంగా తెల్ల నువ్వులు తీసుకోవడం కూడా చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్