
మానవ శరీరంలో నీరు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలిసిందే. మన శరీరంలో దాదాపు 60 నుండి 70 శాతం వరకు నీరే ఉంటుంది. అందుకే రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు నీరు తాగే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అలవాటు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే నిద్రకు భంగం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి వేళ శరీరానికి సరైన మోతాదులో నీరు అందడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరం తన ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి హైడ్రేషన్ అవసరం. నీరు తాగడం వల్ల శరీరం చల్లబడి, ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాల నొప్పి తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిమ్మరసం కలిపిన నీరు తాగితే రోగనిరోధక శక్తి పెరిగి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి, పడుకునే ముందు అతిగా నీరు తాగితే నోక్టోరియా అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ నీరు తాగడం వల్ల రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు.
నీరు తాగిన వెంటనే పడుకోవడం కంటే ఒక క్రమపద్ధతిని పాటించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
హైడ్రేటెడ్‌గా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ అది మన నిద్రను పాడుచేయకూడదు. కాబట్టి పడుకునే ముందు సమయాన్ని బట్టి నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.