Rainy Season Health Tips: వర్షాకాలంలో నీరు తక్కువ తాగుతున్నారా..! ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..

వర్షాకాలంలో చాలా మంది చాలా తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక ఈ రోజు వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు ఏమిటి? ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహార నిపుణులు చెప్పిన సలహాలు ఏమిటి తెలుసుకుందాం..

Rainy Season Health Tips: వర్షాకాలంలో నీరు తక్కువ తాగుతున్నారా..! ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
Rainy Season Health Tips

Updated on: Aug 12, 2025 | 12:54 PM

వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. దీంతో దాహం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది తక్కువగా నీరుని తాగుతారు. అలా నీరు తక్కువగా తాగుతున్న వ్యక్తుల్లో మీరు ఒకరైతే.. కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. దాహం లేదని నీరు తాగడాన్ని తగ్గిస్తే.. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు అంటున్నారు. వర్షాకాలంలో తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే సమస్యలు ఏమిటంటే..

మలబద్ధకం సమస్య
శరీరంలో తగినంత నీరు లేనప్పుడు మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు సకాలంలో చర్యలు తీసుకోకపోతే.. పైల్స్ వంటి వ్యాధులు వస్తాయి. అంతే కాదు, వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

శరీర బలం తగ్గవచ్చు.
ప్రతిరోజూ ఉత్సాహంగా పనిచేయాలంటే శరీరానికి శక్తి అవసరం. దీనికోసం క్రమం తప్పకుండా నీరు త్రాగడం చాలా అవసరం. తక్కువగా నీరు తాగితే శరీరం డీ హైడ్రేట్ బారిన పడుతుంది. దీంతో చిన్న చిన్న పనులు చేసినా వెంటనే అలసిపోతారు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సంబంధిత సమస్యలు
సాధారణంగా మూత్రపిండాలు మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. అయితే శరీరంలో నీటి కొరత ఉంటే అది మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చాలా మంది నీరుని తక్కుగా తాగి.. మూత్రపిండాల సమస్యలను ఆహ్వానిస్తారు.

చర్మ సంబంధిత సమస్యలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో తగినంత నీరు లేనప్పుడు..చర్మం దాని మెరుపును కోల్పోతుంది. ముఖంలో ఆకర్షణ కూడా తగ్గుతుంది. దీనితో పాటు మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. తగినంత నీరు త్రాగే అలవాటు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అదేవిధంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి
శరీరంలో నీటి స్థాయి తగ్గితే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వర్షాకాలంలోనైనా సరే తగినంత నీరు త్రాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)