Rice Water Benefits: బియ్యం కడిగిన నీళ్లు వృద్ధాగా పారబోస్తున్నారా? ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం

అన్నం వండేటప్పుడు చాలా మంది బియ్యం కడిగి.. ఆ నీటిని వృద్ధాగా పారబోస్తుంటారు. కానీ ఈ నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉంటాయట. ఇవి చర్మం నుంచి జుట్టు వరకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే చాలా మందికి దీని గురించి సరైన అవగాహనక లేకపోవడం వల్ల బియ్యం కడిగి..

Rice Water Benefits: బియ్యం కడిగిన నీళ్లు వృద్ధాగా పారబోస్తున్నారా? ఇలా వాడితే మెరిసే అందం మీ సొంతం
Rice Water

Updated on: Jan 27, 2026 | 11:59 AM

సాధారణంగా అందరి ఇళ్లలో అన్నం వండుతుంటారు. అన్నం వండేటప్పుడు చాలా మంది బియ్యం కడిగి.. ఆ నీటిని వృద్ధాగా పారబోస్తుంటారు. కానీ ఈ నీటిలో అనేక పోషకాలు, ఖనిజాలు ఉంటాయట. ఇవి చర్మం నుంచి జుట్టు వరకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే చాలా మందికి దీని గురించి సరైన అవగాహనక లేకపోవడం వల్ల బియ్యం కడిగి నీళ్లు పారబోస్తుంటారు. కాబట్టి బియ్యం నీటి ప్రయోజనాలు, దానిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

బియ్యం కడిగిన నీటి వల్ల ఉపయోగాలు ఏమిటి?

మొక్కలకు వేయవచ్చు

చాలా మంది బియ్యం కడగడానికి ఉపయోగించే నీటిని పారబోస్తారు. బదులుగా మీరు ఈ నీటిని మొక్కలకు వాడవవచ్చు. ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, ఖనిజాలు మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇంటి శుభ్రత

బియ్యం నీటిని ఒక సీసాలో వేసి అద్దాలు, గాజు సామాగ్రిని శుభ్రం చేయడానికి వాడవచ్చు. ముందుగా ఈ నీటిని మరకలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేసి, ఆపై మెల్లగా రుద్ది శుభ్రం చేయండి. గాజు సామాగ్రి బాగా మెరుస్తుంది.

ఇవి కూడా చదవండి

పాత్రలను శుభ్రం చేయడానికి

వంటింటి పాత్రలు శుభ్రం చేసిన తర్వాత కూడా, అల్లం – వెల్లుల్లి పేస్ట్ వాసన కంటైనర్లలో అలాగే ఉంటుంది. ఈ వాసనను వదిలించుకోవడానికి మీరు బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం వాసన ఉన్న కంటైనర్‌లో బియ్యం నీటిని పోసి కొంత సమయం తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వాసన పూర్తిగా పోతుంది. ఇది కంటైనర్‌ల నుంచ గ్రీజును కూడా తొలగిస్తుంది.

బట్టలు శుభ్రం చేయడానికి

బియ్యం నీటిలో సహజ పిండి పదార్ధం ఉంటుంది. దీనిని కాటన్ దుస్తులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.

చర్మానికి కూడా ప్రయోజనకరమే

బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖ రంధ్రాలను బిగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

జుట్టుకు మేలు

బియ్యం నీటిని జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. ఈ నీటితో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టు రాలడం నుంచి ఉపశమనం లభిస్తుంది. చివరలు చిట్లడం తగ్గుతుంది. పొడిబారడం తగ్గుతుంది. అలాగే దీని వాడకం వేగంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.