Lifestyle: అన్నం తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు..

|

Feb 04, 2024 | 5:15 PM

అయితే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది మీకు తెలుసా.? భోజనం చేసిన వెంటనే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ భోజనం చేసిన వెంటనే ఎలాంటి పండ్లు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ జాతికి చెందిన...

Lifestyle: అన్నం తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు..
Lifestyle News
Follow us on

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యం బారినపడడం ఖాయం. ఆహారానికి మేలు చేయడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంది మీకు తెలుసా.? భోజనం చేసిన వెంటనే కొన్ని రకాల పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ భోజనం చేసిన వెంటనే ఎలాంటి పండ్లు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. సిట్రస్‌ పండ్ల వల్ల లాభాలు ఉన్నాయన్న దాంట్లో ఎంత నిజం ఉందో, భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

* సాధారణంగా సిట్రస్‌ పండ్లు పుల్లగా ఉంటాయి. భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ పండ్లు తింటే.. జీర్ణక్రియకు అంతరాయకం కలుగుతుంది. అమ్లత్వం కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అన్నం తిన్న వెంటనే సిట్రస్‌ పండ్లను తింటే.. అజీర్ణం లేదా గుండెల్లో మంటకు కారణం అవుతుంది.

* సింట్రస్‌ పండ్లలో కొన్ని సమ్మేళనాలు.. భోజనం తర్వాత వీటిని తింటే నిర్ధిష్ట పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడు అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లలోని సమ్మేళనాలు పాలీఫెనాల్స్, టానిన్లు, ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే ఐరన్, ఖనిజాలు, కాంప్లెక్స్, కాల్షియం శోషణను తగ్గిస్తుంది.

* సిట్రస్‌ పండల్లో సహజ చక్కెరలు భోజనం తర్వాత వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి, పడిపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

* భోజనం చేసిన వెంటనే సిట్రస్‌ పండ్లు తింటే కొందరిలో ఉబ్బరం లేదా గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఎక్కువగా అసౌకర్యం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..