Honey: తేనెలో వీటికి కలిపి తీసుకుంటున్నారా.? చాలా డేంజర్‌..

|

Nov 10, 2024 | 4:52 PM

తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అయితే తేనెను తీసుకునే విధానంలో కొన్ని తప్పులు చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తేనెను కొన్ని రకాల వస్తువులతో కలిపి తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Honey: తేనెలో వీటికి కలిపి తీసుకుంటున్నారా.? చాలా డేంజర్‌..
Honey
Follow us on

తేనె ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రోజులు నిల్వ చేసినా పాడవ్వని వస్తువుల్లో తేనె ప్రధానమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తేనెలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే తేనెను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వేడి నీటిలో తేనెను కలుపుకొని తీసుకోవడం ఇటీవల ఎక్కువుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరీ వేడి నీటిలో తేనెను కలుపుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరుగుతోన్న నీటిలో తేనెను కలుపుకుని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

* తేనెను నెయ్యితో కలిపి తీసుకోవడం కూడా మంచి కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా నెయ్యి, తేనె కలిపి ఎవరు తీసుకుంటారనే సమాధానం రావొచ్చు. కానీ నెయ్యితో చేసిన స్వీట్స్ తిన్న వెంటనే తేనె తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* స్పైసీ ఫుడ్‌, తేనెను కలిపి తీసుకుంటే మంచిది కాదని అంటున్నారు. బిర్యానీ వంటి స్పైసీ ఫుడ్‌ తీసుకున్న తర్వాత తేనె తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

* ఇక కొందరు టీలో తేనె కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* గుడ్లు, నాన్‌వెజ్ వంటి వాటిని తీసుకున్న తర్వాత కూడా తేనె తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..