Helmet: హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా జుట్టు రాలుతుందా.. అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..

హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానా పడుతుందనే భయం ఒకవైపు.. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనే టెన్షన్ మరోవైపు.. ముఖ్యంగా యువతను వేధిస్తున్న అతిపెద్ద సందేహం ఇదే. మరి నిజంగానే హెల్మెట్ బట్టతలకి దారితీస్తుందా? ఈ విషయంలో ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ చెబుతున్న వాస్తవాలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Helmet: హెల్మెట్ పెట్టుకుంటే నిజంగా జుట్టు రాలుతుందా.. అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..
Does Wearing A Helmet Cause Hair Loss

Updated on: Jan 27, 2026 | 4:24 PM

బైక్ నడిపేవారికి హెల్మెట్ రక్షణ కవచం. చాలా మంది రక్షణ కోసం కాకుండా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధిస్తారనే భయంతోనే పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందనే ఆందోళన చాలామంది యువతలో ఉంది. ఈ భయంతోనే ఎక్కువమంది హెల్మెట్ వాడకాన్ని వ్యతిరేకిస్తుంటారు. మరి నిజంగా హెల్మెట్ వల్ల బట్టతల వస్తుందా? దీనిపై ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ కీలక విషయాలను పంచుకున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా బట్టతల రాదని జావేద్ హబీబ్ స్పష్టం చేశారు. అయితే హెల్మెట్ పెట్టుకునే విధానంలో మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు సమస్యలకు దారితీస్తాయని ఆయన వివరించారు.

చెమట వల్ల అసలు సమస్య

హెల్మెట్ పెట్టుకున్నప్పుడు తలపై విపరీతంగా చెమట పడుతుంది. ఈ తేమ వల్ల జుట్టు మూలాలు బలహీనపడి, జుట్టు రాలడం మొదలవుతుంది. చాలా బిగుతుగా ఉన్న హెల్మెట్లు వాడటం వల్ల లేదా హెల్మెట్ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు జుట్టుపై ఒత్తిడి పడి కుదుళ్లు తెగిపోయే ప్రమాదం ఉంది.

జుట్టు రాలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

హెల్మెట్ ధరిస్తూనే జుట్టును కాపాడుకోవడానికి జావేద్ హబీబ్ కొన్ని అద్భుతమైన చిట్కాలను సూచించారు:

ఇవి కూడా చదవండి

కాటన్ వస్త్రం వాడండి: హెల్మెట్ పెట్టుకునే ముందు తలకు ఒక సన్నని కాటన్ కర్చీఫ్ లేదా టోపీని ధరించండి. ఇది చెమటను పీల్చుకోవడమే కాకుండా హెల్మెట్ జుట్టును లాగకుండా రక్షిస్తుంది.

ప్రతిరోజూ తలస్నానం: హెల్మెట్ వాడేవారు ప్రతిరోజూ జుట్టును శుభ్రం చేసుకోవాలి. తద్వారా పేరుకుపోయిన చెమట, దుమ్ము తొలగిపోతాయి.

తడి జుట్టుతో వద్దు: స్నానం చేసిన వెంటనే జుట్టు ఆరకముందే హెల్మెట్ పెట్టుకోవద్దు. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

హెల్మెట్ శుభ్రత: వారానికి ఒకసారి మీ హెల్మెట్ లోపలి భాగాన్ని శుభ్రం చేయండి. అలాగే ఇతరుల హెల్మెట్‌లను వాడకపోవడమే మంచిది.

సరిపోయే సైజు: ఎప్పుడూ మీ తలకు సరిగ్గా సరిపోయే హెల్మెట్‌నే ఎంచుకోండి.

జుట్టు రాలడానికి ఇతర కారణాలు

కేవలం హెల్మెట్ మాత్రమే కాకుండా.. వంశపారంపర్య కారణాలు, హార్మోన్ల మార్పులు, విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం మరియు కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.