Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!

Electricity Bill: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. పెరిగిన వేడికి ఫ్యాన్‌ వేగం కూడా పెంచాల్సిందే. ఇక ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఉన్నవారు

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!
Ac

Updated on: Apr 11, 2022 | 7:58 AM

Electricity Bill: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. పెరిగిన వేడికి ఫ్యాన్‌ వేగం కూడా పెంచాల్సిందే. ఇక ఎయిర్ కండీషనర్ (ఏసీ) ఉన్నవారు కంటిన్యూగా రన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కరెంటు బిల్లు మాత్రం వాచిపోతుంది. అయితే ఏసీ రన్‌ కావాలి కానీ కరెంట్‌ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటిని అనుసరిస్తే కచ్చితంగా కరెంట్‌ బిల్లు తగ్గుతుంది. అలాంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. సరైన టెంపరేచర్‌ వద్ద AC రన్ చేయాలి

AC టెంపరేచర్ సెట్ చేయడం మర్చిపోవద్దు. వాస్తవానికి తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీ రన్‌ చేయకూడదు.15 నుంచి 16 డిగ్రీల వద్ద ఏసీని నడపడం వల్ల ఇల్లు చల్లగా ఉండవచ్చు. కానీ ఆరోగ్యం, కరెంటు బిల్లు రెండు టెన్షన్ పెడుతాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. AC 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. ఈ ఉష్ణోగ్రత మన శరీరానికి ఉత్తమమైనది. కరెంటు బిల్లు కూడా ఎక్కువగా రాదు.

2. పవర్ బటన్‌ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు

AC ఆఫ్‌లో ఉపయోగంలో లేనప్పుడు దాని పవర్ బటన్‌ను ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. చాలా మంది రిమోట్‌తో ఏసీని ఆఫ్ చేసి పవర్ బటన్‌ను మాత్రం వదిలేస్తారు. దీని వల్ల అనవసరంగా కరెంటు ఖర్చవుతుంది. బిల్లు పెరుగుతుంది. దీన్ని సేవ్ చేయడానికి ఖచ్చితంగా AC పవర్ బటన్‌ను ఆఫ్ చేయాలి.

3. ఏసీలో టైమర్‌ సెట్‌ చేయండి

ఈ రోజుల్లో అన్ని ఏసీలకు టైమర్ ఉంటుంది. రాత్రిపూట AC టైమర్‌ని సెట్ చేయడం మంచిది. గది పూర్తిగా చల్లబడినప్పుడు టైమర్ ప్రకారం దానంతట అదే ఆగిపోతుంది. దీంతో ఖర్చులు ఆదా అవుతాయి.

4. AC సర్వీసింగ్‌

వాస్తవానికి అన్ని ఎలక్ట్రికల్ గాడ్జెట్లని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాలి. ఏసీ విషయంలో కూడా ఇది జరగాలి. భారతదేశంలో ACని ఏడాది పొడవునా వినియోగించరు. శీతాకాలంలో దీనిని పక్కన పెడుతారు. కాబట్టి దానికి సర్వీసింగ్ అవసరం అవుతుంది. ఏసీలో దుమ్ము పేరుకుపోతే అది పనిచేయకుండా పోతుంది. కరెంట్‌ బిల్లు తక్కువ రావాలంటే ఏసీకి సర్వీసింగ్ కూడా అవసరమే.

5. తలుపులు-కిటికీలు మూసి ఉంచండి

ఏసీ ఆన్ చేసే ముందు తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. బయటి గాలి లోపలికి వచ్చినా, లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్‌ చేసి వేస్ట్‌. అనవసరంగా కరెంటు ఖర్చు పెరుగుతుంది. గది చల్లబరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. వాస్తవానికి కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచినట్లయితే గది త్వరగా చల్లబడుతుంది.

RR vs LSG: అశ్విన్ షాకింగ్‌ నిర్ణయం.. IPL చరిత్రలో మొదటిసారి..!

Diabetics: షుగర్‌ పేషెంట్లకి వేసవిలో ఈ ఆహారాలు బెస్ట్‌..!

Health Tips: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు టమోటా తినడం చాలా ప్రమాదకరం..!