Healthy Headphone Use: రోజంతా చెవిలో ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుంటున్నారా?.. గుండె జబ్బులు రావచ్చు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

|

Oct 16, 2022 | 9:06 AM

చెవిలో ఇయర్‌ఫోన్స్‌ లేకుంటే పొద్దు గడవదు. అందులో నుంచి వచ్చే స్వరాలను వింటూ అలా గడిపేస్తారు. ఎవరితో మాట్లాడరు. వారి లోకం అంతా అదే.. అయితే ఇలా నిత్యం ఇయర్‌ఫోన్స్ పెట్టకునేవారికి చెవుడ మాత్రమే కాదు..

Healthy Headphone Use: రోజంతా చెవిలో ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుంటున్నారా?.. గుండె జబ్బులు రావచ్చు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..
Earphones
Follow us on

మనం సినిమా చూడాలన్నా, మొబైల్‌లో పాటలు వినాలన్నా.. అందరం ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తాం. నేటి కాలంలో మన జీవనశైలిలో ఇయర్‌ఫోన్‌లు ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ ఈ ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యంపై ప్రభావం పడటమే కాకుండా గుండె సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇయర్‌ఫోన్‌లు వాడే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల నుంచి వచ్చే శబ్దం చెవిపోటుకు దగ్గరగా ఉన్న కర్ణభేరిని తాకడం వల్ల చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య పెరిగితే చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ ధరించడం వల్ల మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. వాస్తవానికి, ఇయర్‌ఫోన్‌లు లేదా హెడ్‌ఫోన్‌ల నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై ప్రభావం చూపుతాయి.

హర్ట్ బీటింగ్ పెరుగుతుంది..

కొన్నిసార్లు ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ధ్వని భ్రాంతి కలుగుతుంది. ఇది చదివి మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ వినికిడి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అది గుండె సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది.

బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి..

చాలా మంది తమ హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లను పరస్పరం మార్చుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇయర్‌ఫోన్‌లోని స్పాంజ్ ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. ఇది చెవి ఇన్ఫెక్షన్‌కు కూడా కారణం కావచ్చు. అంతే కాకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది సిరల వాపుకు దారితీస్తుంది. కంపనం వల్ల వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి.

చెవి లోపలి భాగానికి దెబ్బ..

కొంతమంది ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని ప్రయాణంలో సంగీతం వింటారు. చుట్టుపక్కల వాతావరణంలో ట్రాఫిక్ శబ్దం వినకుండా నిరోధించవచ్చని వారు భావిస్తున్నారు. కొన్నిసార్లు ఈ పద్ధతి మరింత హానికరం అని రుజువు చేస్తుంది. వాస్తవానికి, ఇది చుట్టుపక్కల వాతావరణంలో చెల్లాచెదురుగా ఉన్న డెసిబెల్‌ల శబ్దం నుండి రక్షిస్తుంది. అయితే ఇయర్‌ఫోన్‌ల ద్వారా నేరుగా చెవులకు చేరే పెద్ద శబ్దం చెవి లోపలి భాగాన్ని బాగా దెబ్బతీస్తుంది.

మొబైల్ వాల్యూమ్ ఏ స్థాయిలో ఉండాలంటే..

ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మొబైల్ వాల్యూమ్ విపరీతంగా పెంచడం వల్ల చెవిపోటు దెబ్బతింటుంది. పెద్ద ప్రమాదం ఏమిటంటే.. పెద్ద శబ్దం కారణంగా, ఆ సమయంలో వ్యక్తికి చెవికి సంబంధించిన ఎటువంటి సమస్య అనిపించదు. కానీ కొంత సమయం తర్వాత నొప్పి అనిపించినప్పుడు. చాలా ఆలస్యం అవుతుంది. ఇది కొన్నిసార్లు తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. కాబట్టి ఇయర్‌ఫోన్‌లు ఆన్‌లో ఉంచుకుని ఏదైనా వింటున్నప్పుడు, మీ గాడ్జెట్ వాల్యూమ్ స్థాయిని 40 శాతం వరకు ఉంచుకోండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం