ఓహో ఇదా అసలు మ్యాటర్.. ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కవగా వస్తే ఏమవుతుంది!

మనం ఆవలింతల గురించి తలుచుకున్నా, వాటి పేరు విన్నా, లేదా ఎవరైనా ఆవలిస్తున్నప్పుడూ చూసినా.. వెంటనే మనకు కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. అసలు ఈ ఆవలింతలు ఎందుకు వస్తాయి. ఇవి అంటు వ్యాధిలా ఎందుకు వ్యాపిస్తాయి. అనేది మీరెప్పుడైనా ఆలోచించారా?. ఈ ఆవలింతల వల్ల మనకు ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా?.. ఎక్కవగా ఆవలింతలు రావడం దేనికి సంకేతం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓహో ఇదా అసలు మ్యాటర్.. ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కవగా వస్తే ఏమవుతుంది!
Excessive Yawning

Updated on: Sep 03, 2026 | 4:54 PM

ఆవలింతలు.. ఇవి వైద్య ప్రపంచంలో ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆవలింతలు అనేవి మెదడును చల్లబర్చడానికి సహాయపడతాయని చెబుతుంటారు. అయితే, మితిమీరిన ఆవలింతలు వాగస్ నాడితో సంబంధం కలిగి ఉండవచ్చని హార్ట్ స్పెషలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాగస్ నాడి మెదడు దిగువన ప్రారంభమై గుండె నుంచి ఉదర భాగం వరకు విస్తరించి ఉంటుందని.. కొన్ని సందర్భాల్లో, గుండె చుట్టూ రక్తస్రావం అధికంగా ఉన్నప్పుడు వ్యక్తులు ఎక్కువగా ఆవలిస్తారని చెబుతున్నారు. దీనిని గుండె నొప్పికి సంకేతంగా భావించవచ్చని కూడా అంటున్నారు.

సాధారణంగా ఆవలింతలు వస్తే శరీరం అలసిపోయిందని, విశ్రాంతి అవసరమని అర్థం చేసుకుంటాం. ఇది సర్వసాధారణమైన ప్రక్రియ. అయితే, నిద్ర సమయంతో సంబంధం లేకుండా, తరచుగా అధిక ఆవలింతలు వస్తుంటే మాత్రం మీ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఆవలింతలు రావడం గుండె పోటు వచ్చేందుకు సంకేతం కూడా కావచ్చంటున్నారు. గుండె నొప్పి రావడానికి ముందు శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.

గుండెపోటుకు ముందు దవడ, మెడ, భుజాలు, వీపు భాగంలో నొప్పిగా ఉండటం, వికారంగా అనిపించడం, తీవ్రమైన అలసట, నడిచినా లేదా మెట్లెక్కినా విపరీతమైన ఆయాసం, గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్లు అనిపించడం వంటివి సాధారణంగా తెలిసిన లక్షణాలే.. కానీ వైద్యులు వీటితో పాటు విపరీతంగా వచ్చే ఆవలింతలను కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా పరిగణించమని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఫలితంగా గుండె కండరాలపై ఒత్తిడి పెరిగి గుండెపోటుకు దారితీస్తుంది. ఏమాత్రం గుండెపోటు సంకేతాలను గుర్తించినా, వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాంతక పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

అధిక ఆవలింతలు, గుండె జబ్బుల మధ్య సంబంధం

ఎక్కువగా ఆవలింతలు హార్ట్ స్ట్రోక్‌కు ముందు లేదా తర్వాత రావచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా వేడి వాతావరణంలో అధిక ఆవలింతలు వస్తే, గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఆవలింతలతో పాటు తిమ్మిరి, బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది పడటం వంటి ఇతర లక్షణాలు కూడా గుండెపోటుకు స్పష్టమైన సంకేతాలు అని చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. సకాలంలో వైద్యుడిని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బులను ముందే గుర్తించి, సరైన చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదిచండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us