Priyanka Chopra: ప్రియాంక చోప్రా అరికాళ్లను వెల్లుల్లితో ఎందుకు మసాజ్ చేశారో తెలుసా.?

|

Jun 30, 2024 | 6:04 PM

వెల్లుల్లి రెబ్బలతో అరికాళ్లను మర్ధన చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసిన సమయంలో అల్లిసిన్ అనే మూలకం ఏర్పడుతుంది. ఇది కండరాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం ద్వారా ఇది రక్తంలోకి చొచ్చుకొనిపోయి..

Priyanka Chopra: ప్రియాంక చోప్రా అరికాళ్లను వెల్లుల్లితో ఎందుకు మసాజ్ చేశారో తెలుసా.?
Priyanka Chopra
Follow us on

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ‘ది బ్లఫ్‌’ అనే సినిమా చిత్రీకరణ సమయంలో ప్రియాంకకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగానే భర్త నిక్‌ జోనాస్‌ తన అరికాళ్లను వెల్లుల్లి రెబ్బలతో మర్ధన చేశారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో బైట్‌ను ప్రియాంక అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ప్రియాంక కాళ్లకు ఇలా చేయడం వెనకాల అసలు కారణం ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి రెబ్బలతో అరికాళ్లను మర్ధన చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసిన సమయంలో అల్లిసిన్ అనే మూలకం ఏర్పడుతుంది. ఇది కండరాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం ద్వారా ఇది రక్తంలోకి చొచ్చుకొనిపోయి క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లిని కీళ్లు, కండరాలపై మర్దన చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది వాపును నివారిచండంలో ఉపయోగపడుతుంది. అలాగే నొప్పిని తగ్గిస్తుంది. ఎక్కువసేపు నడిచే వారికి అరి కాళ్లలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలంలో పాదాల్లో వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా వెల్లుల్లి ఉపశమనం కలిపిస్తుంది. ఈ సమయంలో వెల్లుల్లి ముక్కలను రుద్దితే పాదాలలో కనిపించే వాపు, చీము వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

వర్షంలో తడిసిని కారణంగా వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించడంలో వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరానికి వేడిని అందించడంలో సహాయపడుతుంది. పాదాలకు వెల్లుల్లిని రుద్దడం వల్ల శరీరానికి వేడి అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరిగే వ్యక్తులకు కూడా ఈ వెల్లుల్లి మర్దన ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిని పాదాలకు పూయడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ వేగంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..