కాళ్లు, చేతులు మొద్దుబారినట్లు అనిపించడం సర్వసాధారణమైన విషయం. చేతులు, కాళ్లలోని కొన్ని ప్రాంతాలు స్పర్శను కోల్పోయిన భావన కలుగుతుంది. అయితే అసలు కాళ్లు, చేతులు ఇలా మొద్దుబారడం వెనకాల అసలు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కాళ్లు, చేతులు మొద్దిబారినట్లు అనిపించడానికి ప్రధాన కారణాల్లో ఆయా ప్రాంతాలకు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడమే. రక్తప్రసరణ లేకపోవడం వల్ల అవయవాలు సాధారణంగా పనిచేయడానికి అవసరమైన ఆక్సిజన్ లభించదు. దీంతో కండరాల నొప్పి, తిమ్మిరి, కాళ్లు, చేతులు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
నరాలు లేదా కండరాలు కుదించబడినప్పుడు. ఆ ప్రాంతం తిమ్మిరిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తప్పుగా కూర్చోవడం, నిద్రపోవడం, ఏదైనా వస్తువును అదే పనిగా పట్టుకోవడం వల్ల కూడా తిమ్మిరి వవంటి సమస్య తరచుగా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది నరాలు దెబ్బతినే పరిస్థితికి దారి తీస్తుంది. దీనికి మధుమేహం, విటమిన్ లోపం, మూత్రపిండాల వ్యాధి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కారణంకావొచ్చు.
ఇక మెడ లేదా నడుము భాగంలో గాయమవ్వడం, డిస్క్‌ల్లో సమస్యలు ఏర్పడడం కారణంగా కూడా చేతులు, కాళ్లలో తిమ్మిరికి కారణమవుతుంది. ఇక విటమిన్ బీ12 లోపం కారణంగా కూడా నరాలపై ప్రభావం పడుతుంది. విటమిన్ B-12 లోపం నరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తిమ్మిరి కలగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
సాధారణంగా ఈ తిమ్మిరి సమస్య కాసేపటికి దానంతటదే సెట్ అవుతుంది. అయితే దీర్ఘకాలంగా సమస్యతో బాధపడుతుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..