
సాధారణంగా చాలా మంది బంగారంతోపాటు వెండి ఉంగరాలు, బ్రాస్లెట్లను కూడా ధరిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో బంగారంతోపాటు వెండికి చాలా ప్రాముఖ్యత ఉంది. వెండి చంద్ర గ్రహంతో ముడిపడి ఉంది. చంద్రుడు మనస్సు, భావోద్వాగాలు, మానసిక ప్రశాంతతకు చిహ్నం. చంద్రుడు బలహీనంగా ఉన్నవారు వెండితో చేసిన ఆభరణాలను ధరించాలని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు. వెండితో చేసిన గొలుసు, ఉంగరం లేదా వెండి బ్రాస్లెట్ (Silver Bracelet) కావచ్చు.
వెండి (Silver) బ్రాస్లెట్ ధరించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వెండి ఉంగరాలు, బ్రాస్లెట్లు ధరించడం వల్ల కలిగి ప్రయోజనాలు, ఎవరు ధరించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వెండి బ్రాస్లెట్ ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి.. చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ కారణంగా మీరు చేతికి వెండి బ్రాస్లెట్ ధరిస్తే ఈ రెండు గ్రహాల నుంచి సానుకూల శక్తి మీకు వస్తుంది. మీ మనస్సులో నిరంతరం ప్రతికూల ఆలోచనలు ఉంటే.. మీ పట్ల చంద్రుడు బలహీనంగా ఉన్నాడని చెబుతారు. అలాంటి పరిస్థితిలో మీరు మీ చేతికి వెండి బ్రాస్లెట్ ధరిస్తే మీకు ప్రతి పనిలో చంద్రుడు మద్దతుగా ఉంటాడు. మీ మనస్సులో ప్రతికూలత తొలగిపోయి, సానుకూల ఆలోచనలు వస్తాయి.
చంద్రుడు మీ మనస్సును ప్రభావితం చేసే అత్యంత ప్రభావంతమైన గ్రహం. అందుకే వెండి ధరించడం వల్ల మీ మనస్సు స్థిరంగా ఉండి, మీపై ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే, వెండి బ్రాస్లెట్ ధరించడం వల్ల శుక్ర గ్రహం కూడా మద్దతుగా ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే మీరు చేసే పనులు విజయవంతమవుతాయి. మీరు చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. మీరు పని, ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు సాధిస్తారు.
చాలా మంది బంగారంతోపాటు వెండి ఉంగరాలను కూడా ధరిస్తుంటారు. వెండి ఉంగరాలు ధరించడం వల్ల పలు ప్రయోజనాలు చేకూరుతాయి. మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, మెరుగుపడతారు. మీరు క్రమం తప్పకుండా వెండి ఉంగరాలను ధరిస్తే.. సంపదకు దేవత అయిన లక్ష్మీ మాత అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మీన రాశులవారు తమ చేతులకు వెండి ఉంగరాలు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు ఎప్పుడూ కూడా తమ ఎడమ చేతికి వెండి ఉంగరాలు ధరించాలి. స్త్రీలు తమ కుడి చేతికి ధరించాలి.
Note: (జ్యోతిష్యం, వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)