Microplastics: శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..

|

Oct 05, 2024 | 5:22 PM

మానవ ఊపిరిత్తులు, మెదడులో మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపించడం అందరినీ ఉలిక్కపడేలా చేసింది. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌ రూపంలో ప్లాస్టిక్‌ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్స్‌పై ఇప్పటి వరు జరిగిన 7వేలకి పైగా అధ్యయనాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సైన్స్‌ మ్యాగజైన్‌ ప్రకారం.. గత 20 సంవత్సరాలుగా...

Microplastics: శరీరంలోకి ప్లాస్టిక్‌ ఎలా వెళ్తుందో తెలుసా.? షాకింగ్‌ విషయాలు..
Microplastics
Follow us on

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న అంశం ప్లాస్టిక్‌. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వాడకం కారణంగా పర్యావరణం కాలుష్యమవుతోన్న విషయం తెలిసిందే. విపరీతమైన ప్లాస్టిక్‌ వాడకంతో సముద్రాలు, నదులు కలుషితంగా మారుతున్నాయి. ఏళ్లపాటు భూమిలో కలిసిపోని ప్లాస్టిక్‌ ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది. అయితే తాజాగా పరిశోధనల్లో వెల్లడవుతోన్న షాకింగ్ విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మనిషి శరీరంలోకి ప్లాస్టిక్‌ ప్రవేశించడం ఇప్పుడు షాకింగ్‌కి గురి చేస్తోంది.

మానవ ఊపిరిత్తులు, మెదడులో మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు కనిపించడం అందరినీ ఉలిక్కపడేలా చేసింది. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌ రూపంలో ప్లాస్టిక్‌ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్స్‌పై ఇప్పటి వరు జరిగిన 7వేలకి పైగా అధ్యయనాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సైన్స్‌ మ్యాగజైన్‌ ప్రకారం.. గత 20 సంవత్సరాలుగా, క్రమేణా, అడవి జంతువులతో పాటు మానవు శరీరంలో అనేక మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని కనుగొన్నట్లు ఒక పరిశోధనా పత్రం వెల్లడించింది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌ ఆహారం, డ్రింక్స్‌ రూపంలో ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అసలు ప్లాస్టిక్‌ ఎలా వస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం, ప్లాస్టిక్స్‌ కవర్స్‌ను ఉపయోగించడం, ఇతర ప్యాకేజీంగ్ పదార్థాల కోసం ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం కూడా ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఇక బ్యూటీ ప్రొడక్ట్స్‌ వల్ల కూడా ప్లాస్టిక్‌ శరీరంలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫేస్ వాష్, బాడీ లోషన్, టూత్‌పేస్ట్ వంటి అనేక సౌందర్య ఉత్పత్తులు మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. సింథటిక్ బట్టలను ఉతికే సమయంలో చిన్న మైక్రోప్లాస్టిక్ ఫైబర్‌లను విడుదల చేస్తాయి. ఇవి నీటి ద్వారా పర్యావరణంలో చేరుతాయి. అలాగే అనేక పరిశ్రమల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో మైక్రోప్లాస్టిక్‌లు ఉంటాయి. ఇవన్నీ విభిన్న మార్గాల్లో మనిషి శరీరంలోకి ప్లాస్టిక్‌ వెళ్లడానికి కారణమవుతున్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..