Body Building : కరోనా వల్ల యువత ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్యం కోసం సమయం కేటాయిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బాడీ బిల్డింగ్‌పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆకర్షణీయమైన దేహం కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా తొందరగా బాడీబిల్డర్‌గా మారాలనే ఉద్దేశ్యంతో చాలామంది తెలియకుండా తప్పులు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు.
జిమ్‌కు వెళ్లిన తర్వాత కసరత్తులు ప్రారంభించే ముందు వార్మప్ చేయడం చాలా ముఖ్యం. ఆ తర్వాత శరీరం అన్ని ఎక్సర్ సైజ్‌లకి సిద్దంగా ఉంటుంది. తరువాత మీ సామర్థ్యం ప్రకారం బరువులు ఎత్తవచ్చు. జిమ్‌లో వార్మప్ చేయకుండా బరువులు ఎత్తితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కోచ్‌లు, సీనియర్లు చెప్పినా వినకుండా కొంతమంది తొందరగా బాడీ బిల్డింగ్ చేయాలని షాట్‌కట్ ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు చాలా దెబ్బతింటారు. జిమ్‌కి వెళ్లిన తర్వాత వార్మప్ చేయడం కచ్చితంగా అవసరం. లేదంటే చాలా నష్టపోతారు. అంతేకాకుండా మరికొందరు అధిక బరువులు ఎత్తడానికి శక్తి కోసం సప్లిమెంట్లను తీసుకుంటోంది.
బాడీ బిల్డింగ్ చేయాలంటే ప్రొటీన్ కచ్చితంగా అవసరం. ఉద్యోగులు, బిజీగా ఉండే వ్యాపారులు, తగినంత ప్రోటీన్ తీసుకోలేని వ్యక్తులు విడిగా ప్రోటీన్‌ను తీసుకోవచ్చు. శరీరంలో ఇప్పటికే తగినంత ప్రోటీన్ ఉన్న వ్యక్తులు మళ్లీ ప్రోటీన్ తీసుకోవలసిన అవసరం లేదు. బాడీ బిల్డింగ్ చేయడానికి ఎప్పుడు షాట్‌కట్ ప్రయత్నించకూడదు. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. మీరు సహజంగా మంచి శరీరాన్ని కోరుకుంటే దీని కోసం చాలా కాలం కష్టపడాలి. కానీ నేటి యువత తక్కువ సమయంలో మంచి శరీరాన్ని నిర్మించాలనే కోరికతో స్టెరాయిడ్లు తీసుకుంటున్నారు. ఇది వారి ఆరోగ్యం, శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది.