Candle Bush: మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. వీటి ప్రత్యేక తెలిస్తే వెంటనే తెచ్చి పెంచుకుంటారు!

క్యాండిల్ బుష్ అద్భుత ఔషధ గుణాలున్న ఈ మొక్కను మీరెప్పుడైనా చూశారు. దీని శాస్త్రీయ నామం సెన్నా అలాటా. ఇది చర్మ సంబంధ వ్యాధులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెటీగలు, సీతాకోక చిలుకలను ఆకర్షించే ఈ ఉష్ణ మొక్క ఇప్పుడు విశాఖలోని జీవవైవిధ్య ఉద్యానవనంలో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీని ప్రాముఖ్యతను గుర్తించి, మనుగడను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Candle Bush: మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. వీటి ప్రత్యేక తెలిస్తే వెంటనే తెచ్చి పెంచుకుంటారు!
Candle Bush Benefits

Edited By:

Updated on: Feb 07, 2026 | 9:35 PM

సృష్టిలో అనేక రకాల మొక్కలు చెట్లు ఉంటాయి.. ఒక్కో చెట్టుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఫల, పుష్పాల మొక్కలు, ఔషధ గుణాల మొక్కలు, కూరగాయల మొక్కలు ఇలా.. చాలా రకాలు మనకి తెలుసు. కానీ మనకు ఉపయోగపడే మొక్కలు మనకు తెలియనివి చాలా వరకు సృష్టిలో ఉన్నాయి. వాటిలో క్యాండిల్ బుష్ కూడా ఒకటి. దాన్నే కొవ్వొత్తి పువ్వుల మొక్క అని కూడా అంటారు. అంతేకాదు దీనికి మరొక పేరు కూడా ఉంది అదే క్రిస్మస్ క్యాండిల్. ఇంతకు దీని ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

ఈ పుష్పం చూడ్డానికి అందంగా కొవ్వత్తిలా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం సెన్నా అలాటా. దీనినే క్యాండిలాబా బుష్ అని కూడా అంటారు. ఇది పసుపు వర్ణంలో ఆకట్టుకుంటూ తేనెటీగలు, సీతాకోక చిలుకలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది ఒక ఉష్ణ మొక్క. దక్షిణ అమెరికాకు చెందిన ఈ జాతి మొక్క.. ఇప్పుడు భారతదేశం సహా అనేక ఉష్ణ ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్క ఆకులకు చర్మ సంబంధ వ్యాధులు తగ్గించే గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చెట్టునే సీమ తంగేడు, మెట్ట తామర, మెట్ట తంగేడు అని కూడా పిలుస్తారట.

ఇంతటి విశేషాలు ఉన్న ఈ మొక్క ఇప్పుడు విశాఖలోని జీవవైవిద్య ఉద్యానవనంలో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పసుపు వర్ణంలో పూలను పూచి తన వైపు ఆకర్షిస్తుంది. ఇది అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క అని అంటున్నారు జీవవైవిద్య ఉద్యానవన నిర్వాహకులు డాక్టర్ రామమూర్తి. చర్మ సంబంధ వ్యాధులతో పాటు వాపులను కూడా నివారించే గుణం ఈ మొక్కలో ఉందని అంటున్నారు. అందుకే వీటిని మనుగడను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.