
కావాల్సిన పదార్థాలు : మ్యారినేషన్ కోసం..బోన్‌లెస్ చికెన్ - 500g, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు, కారం - 2 టీస్పూన్లు, ధనియాల పొడి - 1 టీస్పూన్ గరం మసాలా - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్ నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడ, ఫుడ్ కలర్ - చిటికెడు ఆరెంజ్ రెడ్, ఆప్షనల్స్

తయారు చేయడానికి:ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడ, కరివేపాకు - 3 రెమ్మలు, పచ్చిమిర్చి - 4, నిలువుగా చీల్చినవి, వెల్లుల్లి - 10 రెబ్బలు, దంచినవి, కారం - 1 టీస్పూన్

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా చికెన్ తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి, మనం మ్యారినేషన్ కోసం చెప్పిన పదార్థాలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, నిమ్మరసం,పెరుగు, ఉప్పు, అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు తాళింపు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో సరిపడ నూనె పోసి, కరివేపాకు రెబ్బలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ వేసి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ మెత్తగా ఉడికేలా చూసుకోవాలి.

చికెన్ చాలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం, కరివేపాకు, పచ్చి మిర్చీ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి మరో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. బాగా ఉడికి ఫ్రై అయిపోతుంది. కర్రీ చాలా దగ్గరగా వస్తుంది. అంతే తమిళనాడు స్టైల్ చంద్రముఖి చికెన్ ఫ్రై రెడీ.