కొత్తమీర త్వరగా వాడిపోతుందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

Coriander Storage Hacks: మనం వండుకేనే వంటకాల రుచిని, సువాసను పెంచడంలో కొత్తి మీర ఎంతోగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇది మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఫేస్ చేసే ప్రధాన సమస్య ఏమింటంటే.. కోతిమీర తాజాగా నిల్వ చేయడం. మనం మార్కెట్‌ నుంచి కొనుకొచ్చిన కొత్తిమీర తెచ్చిన కొన్ని గంటలకే వాడిపోతుంది. అయితే కొన్ని టిప్స్‌ పాటించడం ద్వారా మనం వారం రోజులైన కొత్తిమీరను తాజాగా ఉంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి.

కొత్తమీర త్వరగా వాడిపోతుందా?.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!
Coriander Storage Hacks

Updated on: Dec 28, 2025 | 6:05 PM

కొత్తిమీరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా కడగకపోతే లేదా ఆరబెట్టకపోతే, ఆకుల మధ్య మిగిలి ఉన్న తేమ అవి కుళ్ళియేలా చేస్తుంది. ముఖ్యంగా వీటిని గాలి చొరబడిన ప్రదేశంలో అస్సలు ఉంచరాదు. మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే దానికి శుభ్రంగా కడగండి. తర్వాత ఆ నీరు మొత్తం వదిపోయేలా దానికి శుభ్రంగా ఆరబెట్టండి. ఇలా చేయడం ద్వారా కొత్తి మీర ఆకుల మధ్య తేమ శాతం తగ్గి ఆది కుళ్లిపోకుండా ఉంటుంది.

పసుపు నీటిటో శుభ్రం చేయడం

కొత్తిమీర ఆకులను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి పసుపు నీటి పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో కొన్ని నీటిని తీసుకొని అందులో కొంచెం పుసును వేయండి. తర్వాత కొత్తి మీరను ఆ పసుపు నీటిలో 20 నుండి 30 నిమిషాలు నానబెట్టండి. పసుపులోని సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆకులలోని క్రిములను చంపేస్తాయి. తరువాత ఆకులను శుభ్రమైన నీటిలో మళ్ళీ కడిగి ఆరబెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు కొత్తి మీరను తాజాగా ఉంచుకోవచ్చు.

సరైన ఎండబెట్టడం

చాలా మంది చేసే తప్పు ఏమిటంటే కొత్తిమీర కడిగిన వెంటనే ఒక జార్‌ వేసి మూతపెట్టడం. అవును కొత్తిమీరను కలిగిన వెంటనే నేరుగా కంటైనర్‌లో వేయడం పెద్ద తప్పు. ముందుగా, ఆకులను బాగా ఆరబెట్టాలి. కాగితపు టవల్ లేదా కాటన్ క్లాత్‌ను ఉపయోగించి ఆకులపై ఉన్న నీటిని సున్నితంగా తుడవండి. ఆకులపై ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదు. ఏదైనా నీరు మిగిలి ఉంటే, ఆకులు ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ కుళ్ళిపోయే అవకాశం ఉంది.

పైన పేర్కొన్న ఈ పద్దతులను ఉపయోగించడం ద్వారా కొత్తిమీరను ఎక్కవ రోజుల పాటు తాజాగా ఉంచుకోవచ్చు. ఈ చిన్న టిఫ్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ ఆహారంలో రుచిని పెంచే కొత్తి మీర ప్రయోజనాలను మీరు పొందవచ్చు. అలాగే తరచూ కొనాల్సిన అవసం లేకుండా డబ్బును ఆదాచేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.