Tips for Copper Vessels: రాగి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. తెల్లగా మారడం ఖాయం..

ఎవరి ఇంట్లో అయినా రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అనేవి కామన్‌గా ఉండే వస్తువులు. మరీ ఎక్కువగా లేకపోయినా.. ఎన్నో కొన్నో ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్లో రాగి వస్తువులు కూడా ఉంటాయి. రాగి పాత్రల్లోని నీరు తాగడం చాలా మంచిదని పూర్వం నుంచి పెద్దలు చెబుతూ వచ్చారు. మధ్యలో వాటిని ఎవరూ పట్టించుకోక పోయినా.. ఇప్పుడు మళ్లీ చాలా మంది రాగి పాత్రలను కొంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది రాగి చెంబులు, బిందెలు, బాటిల్స్..

Tips for Copper Vessels: రాగి పాత్రలను వీటితో క్లీన్ చేస్తే.. తెల్లగా మారడం ఖాయం..
Copper Vessels Clean
Follow us
Chinni Enni

|

Updated on: May 15, 2024 | 12:56 PM

ఎవరి ఇంట్లో అయినా రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అనేవి కామన్‌గా ఉండే వస్తువులు. మరీ ఎక్కువగా లేకపోయినా.. ఎన్నో కొన్నో ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్లో రాగి వస్తువులు కూడా ఉంటాయి. రాగి పాత్రల్లోని నీరు తాగడం చాలా మంచిదని పూర్వం నుంచి పెద్దలు చెబుతూ వచ్చారు. మధ్యలో వాటిని ఎవరూ పట్టించుకోక పోయినా.. ఇప్పుడు మళ్లీ చాలా మంది రాగి పాత్రలను కొంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది రాగి చెంబులు, బిందెలు, బాటిల్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చూడటానికి కొత్తలో చాలా బావుంటాయి. కానీ వీటిని వాడే కొద్దీ నల్లగా మారిపోతూ ఉంటాయి. ఒక్క నీటి చుక్క పడినా.. ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు వచ్చేస్తాయి. చూడటానికి కూడా చిరాకుగా ఉంటాయి. రాగి వస్తువులను క్లీన్ చేయాలంటే పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. కానీ వీటితో కనుక క్లీన్ చేస్తే.. తెల్లగా మెరుస్తాయ్. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ రసం – ఉప్పు:

నిమ్మకాయ రసం, ఉప్పుతో కూడా మనం రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేస్తే.. ఇవి త్వరగా క్లీన్ అయిపోవడమే కాకుండా.. తెల్లగా మెరుస్తాయి. ముందుగా నిమ్మకాయను కట్ చేసి.. చిన్న బౌల్‌లోకి రసం తీసుకోవాలి. అందులో ఉప్పు వేసి స్క్రబ్బర్‌తో రాగి పాత్రలను తోమండి. వీటితో క్లీన్ చేయడం వల్ల చాలా సులభంగా మరకలు వదిలిపోతాయి. మళ్లీ రాగి పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి.

వంట సోడా:

వంటకు ఉపయోగించే సోడాతో కూడా మనం రాగి పాత్రల్ని తెల్లగా మార్చుకోవచ్చు. బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మ రసంలో పిండి.. పేస్టులా చేయండి. దీంతో రాగి పాత్రలను శుభ్ర పరిస్తే.. ఇవి చక్కగా క్లీన్ అవుతాయి.

ఇవి కూడా చదవండి

టమాటా కెచప్:

టమాటా కిచెప్‌తో కూడా మీరు రాగి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. ఇది మీకు వింతగా అనిపించినా నిజం. ఎందుకంటే ఇందులో కూడా పులుపు దనం ఉంటుంది. కాబట్టి రాగి పాత్రలు తెల్లగా మారతాయి. టమాటా కెచప్‌లో ఆమ్ల గుణాలు కూడా ఉంటాయి కాబట్టి.. మరకలు వదులుతాయి. రాగి పాత్రలపై టమాటా కెచప్ రాసి ఓ ఐదు నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత మెత్తని స్పాంజ్‌తో క్లీన్ చేస్తే సరి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..