వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి

మీరు మీ వాటర్ బాటిళ్లను శుభ్రం చేయడానికి కష్టపడుతున్నారా..? లోపల సబ్బు, డిటర్జెంట్, డిష్ వాషింగ్ లిక్విడ్‌ను ఉంచి బ్రష్‌తో కడగవచ్చు, కానీ, దీనికి చాలా సమయం పడుతుంది. ఈ సబ్బు, డిటర్జెంట్ లిక్విడ్ వాసన త్వరగా పోదు.. అందువల్ల, మీరు మరొక విధంగా చాలా సులభంగా వాటర్‌ బాటిళ్లను కడగవచ్చు..! ఈ పద్ధతి ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పట్టదు..

వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
Leaning Water Bottles

Updated on: Jan 12, 2026 | 9:52 PM

చాలా మందికి బాటిల్‌లో నీళ్లు పెట్టుకుని తరచుగా తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసు పనికి, పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేవారు తమ వెంట వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుంటారు. ప్లాస్టిక్, స్టీల్, గాజు, రాగి లేదా ఫైబర్ ఏదైనా సరే, చాలా మంది బాటిళ్ల లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి బద్ధకంగా ఉంటారు. నెలల తరబడి బాటిళ్లను కడగరు. కానీ, ఇది మంచి సంకేతం కాదు. బాటిళ్లను బయటి నుండి మాత్రమే కడగడం సరిపోదు, లోపలి భాగాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అలాగే, మీరు థర్మోస్, ఫ్లాస్క్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటిలో నీళ్లు పోయడంతో లోపలి భాగం జిగటగా మారుతుంది. అది మురికిగా మారుతుంది. అందువల్ల, అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు బాటిళ్ల లోపల సబ్బు, డిటర్జెంట్, డిష్ వాషింగ్ లిక్విడ్‌ను ఉంచి బ్రష్‌తో కడగవచ్చు, కానీ దీనికి చాలా సమయం పడుతుంది. ఈ సబ్బు, డిటర్జెంట్ లిక్విడ్ వాసన త్వరగా పోదు.. అందువల్ల, మీరు మరొక విధంగా చాలా సులభంగా వాటర్‌ బాటిళ్లను కడగవచ్చు..! ఈ పద్ధతి ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పట్టదు..

మీ బాటిల్‌ను సబ్బు, నీటితో కడగడం మానేయండి. లోపలి నుండి మురికిని పూర్తిగా తొలగించడానికి ఒక సింపుల్‌ ఉపాయం ఉంది. దీని కోసం ముందుగా, మీరు ఒక చెంచా బియ్యపు గింజలను సీసాలో వేయండి. దానికి ఒక చెంచా బేకింగ్ సోడా, 1 చెంచా ఉప్పు కలపండి. తరువాత ఆ సీసాలో అర గ్లాసు నీరు వేసి బాగా కుదపండి. తర్వాత లోపల ఉన్న నీటిని పారబోయండి. ఇప్పుడు అర గ్లాసు గోరువెచ్చని నీరు, అర చెంచా ఉప్పు వేసి 5 నిమిషాలు షేక్ చేయండి. ఈ నీటిని కూడా పార పోయాలి. దీని తరువాత, లోపలి భాగాన్ని శుభ్రమైన నీటితో 2-3 సార్లు కడిగేసుకోండి. ఇది మీ బాటిల్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. మీరు ప్రతి 4-7 రోజులకు ఈ పద్ధతిలో బాటిల్‌ను శుభ్రం చేయవచ్చు.

కానీ పాలు, టీ, జ్యూస్‌ల కోసం ఉపయోగించే సీసాలను ప్రతిరోజూ కడగాలి. అలాంటి సీసాలను తేలికపాటి డిష్‌వాషింగ్ లిక్విడ్, వేడి నీటితో కడగాలి. తర్వాత వాటిని ఉప్పు, బేకింగ్ సోడాతో మళ్ళీ శుభ్రం చేయండి. లేకపోతే, అలాంటి సీసాలు దుర్వాసన వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..