నగర మహిళలకు పొంచిఉన్న ఊబకాయం ముప్పు

| Edited By:

Oct 06, 2019 | 6:08 PM

నగరాల్లో నివసించే మహిళలకు ఇప్పుడు మరో సమస్య పొంచి ఉంది. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికంటే ఎక్కువగా నగరంలో ఉండే మహిళలే త్వరగా లావెక్కుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల వారికంటే త్వరగా అస్వస్థతకు గురవ్వుతున్నట్లు తేలింది. దీనికి కారణం వారు చేసే నిత్య కృత్యాలే. నగరంలో శారీరక శ్రమ తక్కువ ఉండటం ఒక కారణమైతే.. తినే ఆహారపుటలవాట్లు కూడా మరో కారణం. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వారు తినే ఆహార అలవాట్లు, శారీరక శ్రమ […]

నగర మహిళలకు పొంచిఉన్న ఊబకాయం ముప్పు
Follow us on

నగరాల్లో నివసించే మహిళలకు ఇప్పుడు మరో సమస్య పొంచి ఉంది. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికంటే ఎక్కువగా నగరంలో ఉండే మహిళలే త్వరగా లావెక్కుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల వారికంటే త్వరగా అస్వస్థతకు గురవ్వుతున్నట్లు తేలింది. దీనికి కారణం వారు చేసే నిత్య కృత్యాలే. నగరంలో శారీరక శ్రమ తక్కువ ఉండటం ఒక కారణమైతే.. తినే ఆహారపుటలవాట్లు కూడా మరో కారణం. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వారు తినే ఆహార అలవాట్లు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం ద్వారా వీరు ఊబకాయం బారిన త్వరగా పడకుండా ఉంటున్నట్లు సర్వేలో తేలింది. ఈ అధిక బరువుతో మధుమేహం, రక్తపోటు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఓ సర్వే ప్రకారం బెంగళూరులో 2015-16లో అధిక బరువుతో బాధపడుతున్న వారు 23.3 శాతం మంది ఉన్నారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 33.5 శాతం, 23.4 శాతం మహారాష్ట్రలో ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. ప్రస్తుతం ఉన్న ఈ ఊబకాయం సమస్య భవిష్యత్తులో ఎన్నో అనర్థాలకు దారితీసేట్లుగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ఊబకాయం ద్వారా హైపర్ టెన్షన్, అధిక బరువు, డయాబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. నిత్యం వ్యాయామం చేయడం, నియమిత ఆహారం తినడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చిన పరిశోధకులు తెలిపారు.