
బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అయితే గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు పొందలేకపోతున్నారు. కానీ, కొందరు ఆయుర్వేద చిట్కాలను కూడా పాటిస్తుంటారు. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం కూడా మంచిది. ప్రతిరోజు కేవలం ప్రోటీన్ ఎక్కువ మోతాదులో లభించే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సిఉంటుంది. దీంతోపాటు శారీరక శ్రమ కూడా అవసరం.
ముఖ్యంగా వేసవికాలంలో వేగంగా బరువు తగ్గాలనుకునే వారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తే చాలు..ఈజీగా మీరు కొరుకున్నట్టుగా బరువు తగ్గొచ్చు. అందులో భాగంగా ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాదు..ఎంతో సింపుల్‌గా ఎక్కువ శ్రమ పడకుండానే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క నీటిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. దీంతోపాటు విటమిన్ కె కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ నీటిని రోజు తాగడం చాలా మంచిది. దాల్చిన చెక్క నీటిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా దాల్చిన చెక్కను ఓ గిన్నెలోకి తీసుకుని అందులో సరిపడా నీటిని పోసుకుని బాగా మరిగించుకోవాలి. దాల్చిన నీరు బాగా మరిగిన తరువాత వడకట్టుకొని.. కావలసినంత తేనె వేసుకుని ఉదయాన్నే తాగండి. ఇలా తాగితే రెండు వారాల్లోనే బరువు తగ్గుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..