Firefighter Viral Video: ఈ ప్రపంచంలో చిన్న పని, పెద్ద పని అంటూ ఏది ఉండదు.. మనకు నచ్చింది చేస్తూ.. మనం చేస్తోన్న వృత్తి ధర్మం పట్ల గౌరవంగా ఉంటే జీవితంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే పనిని తప్పించుకోవడానికి కారణాలను వెతుక్కుంటారు కొందరు.. కానీ చైనాకు చెందిన ఈ అగ్నిమాపక సిబ్బంది గురించి తెలుసుకుంటే అసలైన వృత్తి ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది. చైనాలోని ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వృత్తి ధర్యం పాటించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఓ ఫైర్‌ఫైటర్ బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నాడు. అదే సమయంలో ఏదో ప్రమాదం జరిగిందని హెచ్చరికగా పెద్దగా సైరన్ మోగింది. తాను వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలి, లేకపోతే ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని భావించిన సదరు వ్యక్తి కనీసం ఒంటిపైన ఉన్న సబ్బు కూడా తూడుచుకోకుండా బాత్‌రూమ్ నుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. ఆ క్రమంలో కాళుకు సబ్బు ఉండడంతో జారి పడ్డాడు. దీంతో అతని చెప్పు ఒకటి అక్కడే పడిపోయింది. అయితే ఆ విషయాన్ని కూడా పట్టించుకొని సదరు వ్యక్తి పరిగెడుతూనే ఉన్నాడు. ఫైర్ వెహికిల్‌లో తలపై షాంపూ ఉన్న కూడా యూనిఫామ్ వేసుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆలరాన్ని మాక్ డ్రిల్‌లో భాగంగా మోగించారు. ఉద్యోగులు అలర్ట్‌గా ఉన్నారా? లేదా అని తెలుసుకోవడానికి ఇలాంటి మాక్ డ్రిల్స్‌ను నిర్వహిస్తుంటారు. ఇక ఇలాంటి వీడియోనే మరొకటి అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు. అదే సమయంలో అలారం మోగడంతో కూతురును అక్కడే వదిలేసి హుటాహుటిన పరిగెత్తాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరు తమ వృత్తిపై చూపిన డెడికేషన్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
This firefighter in China answered the call of duty, even while in the shower. pic.twitter.com/d9wEKR5aE4
— SCMP News (@SCMPNews) April 6, 2021
‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…