Chicken VS Eggs: చికెన్ VS గుడ్డు.. రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?

చికెన్, గుడ్లు అంటే చాలా మందికి ఇష్టం. వారికి నచ్చినట్టుగా వండుకుని తింటూ ఉంటారు. ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిదే. అయితే చికెన్ తినడం కంటే గుడ్డే మేలని కొంత మంది అంటే.. కాదు కాదు చికెనే మంచిదని మరికొంత మంది వాదిస్తూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా వారంలో నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలంటే. అందులోనూ చికెన్ లవర్స్ అయితే.. కోడి కూర ఉడకాల్సిందే. ఈ రెండింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా..

Chicken VS Eggs: చికెన్ VS గుడ్డు.. రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?
Chicken Vs Eggs
Follow us

|

Updated on: Jul 01, 2024 | 5:27 PM

చికెన్, గుడ్లు అంటే చాలా మందికి ఇష్టం. వారికి నచ్చినట్టుగా వండుకుని తింటూ ఉంటారు. ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిదే. అయితే చికెన్ తినడం కంటే గుడ్డే మేలని కొంత మంది అంటే.. కాదు కాదు చికెనే మంచిదని మరికొంత మంది వాదిస్తూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా వారంలో నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలంటే. అందులోనూ చికెన్ లవర్స్ అయితే.. కోడి కూర ఉడకాల్సిందే. ఈ రెండింటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. వ్యాయామం చేసే వారు ఎక్కువగా ఈ రెండింటిలో ఏదో ఒకటి తింటూ ఉంటారు. గుడ్డు, కోడి మాంసం రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే వీటిల్లో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్:

నాన్ వెజ్‌లో చేపలు, రొయ్యలు, మటన్ తినే వారి కంటే చికెన్ తినే వారి సంఖ్యే ఎక్కువ. చికెన్ తక్కువ ధరకే లభ్యమవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక 100 గ్రాముల చికెన్‌లో.. 27 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే నియసిన్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ బి, ఆరోగ్యకరమైన కొవ్వులు లభ్యమవుతాయి. క్యాలరీ కంటెంట్ కూడా తక్కువగానే ఉంటాయి. చికెన్ తినడం వల్ల పోషకాహార లోపం తీరుతుంది. వారంలో రెండు సార్లు అయినా చికెన్ ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లో ఇతర భాగాల కంటే.. బ్రెస్ట్ పీస్ ఎక్కువగా మేలు చేస్తుంది. చికెన్‌ని బాగా ఉడక బెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్ మంచిది కదా అని ఎక్కువగా తీసుకున్నా అనారోగ్య సమస్యలు తప్పవు.

కోడి గుడ్డు:

ప్రతి రోజూ ఒక ఉడక బెట్టిన కోడి గుడ్డు ఖచ్చితంగా తినాలని ప్రభుత్వాలే చెబుతున్నాయి. ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు ఒకటి తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. కోడి గుడ్డులో.. ప్రోటీన్, క్యాల్షియం, కోలిన్, రిబోఫ్లావిన్, లుటిన్, జియాకృంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు డి, బి 12 లభిస్తాయి. గుడ్డును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరదు. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి లభిస్తుంది. కాబట్టి మీ ఆహార అవసరాలను బట్టి మీ మెను అనేది మార్చుకుంటూ ఉండాలి. చికెన్ ఎక్కువగా తీసుకున్న రోజు గుడ్డు తినాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీ పన్ను చెల్లించవచ్చు.. ఎలాగంటే
మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీ పన్ను చెల్లించవచ్చు.. ఎలాగంటే
ఇక ఆటలు సాగవు.. తిరుమలలో దళారులకు టీటీడీ చెక్..!
ఇక ఆటలు సాగవు.. తిరుమలలో దళారులకు టీటీడీ చెక్..!
'తిట్టిన ప్రతీ నోరు మూసుకోవాల్సిందే..' రోహిత్ ఫ్యాన్ ఏం చేశాడంటే
'తిట్టిన ప్రతీ నోరు మూసుకోవాల్సిందే..' రోహిత్ ఫ్యాన్ ఏం చేశాడంటే
కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..?
కమెడియన్ రఘు కూతుళ్లను ఎప్పుడైనా చూశారా..?
ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు?
ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు..!
జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన
ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా పెరిగిన వడ్డీ
ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై భారీగా పెరిగిన వడ్డీ
ఫుల్ టైమ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ హీరోయిన్..
ఫుల్ టైమ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిన స్టార్ హీరోయిన్..
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెంగ్యూ 50 శాతం శాంపిల్స్‌లో పాజిటివ్‌‌