కేవలం1 రూపాయితో సీలింగ్ ఫ్యాన్‌ శుభ్రం చేసుకునే అద్భుత చిట్కా…ఈరోజే మీ ఇంట్లో ట్రై చేయండి..

|

Mar 29, 2023 | 10:11 PM

చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా అన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ తప్పనిసరి. కానీ దానిని శుభ్రం చేయడం కూడా అంతే కష్టం. అందుకే ఈరోజు మేము మీకు సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి ఒక మంచి ఉపాయం చెప్పబోతున్నాం.. ఈ ట్రిక్‌ని పాటిస్తూ మీరు మీ ఫ్యాన్‌ని మళ్లీ కొత్తగా కనిపించేలా చేసుకోవచ్చు.

కేవలం1 రూపాయితో సీలింగ్ ఫ్యాన్‌ శుభ్రం చేసుకునే అద్భుత చిట్కా...ఈరోజే మీ ఇంట్లో ట్రై చేయండి..
House Cleaning
Follow us on

ఇంటిని శుభ్రపరిచే విషయానికి వస్తే, ప్రతిదీ సులభంగా శుభ్రం చేయొచ్చు. అయితే సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఎత్తులో ఉంటుంది కాబట్టి. దానిని శుభ్రం చేయడం ప్రజలకు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి ఇంట్లో కూలర్, ఏసీలు లేకపోయిన తప్పనిసరిగా సీలింగ్ ఫ్యాన్ వేలాడదీసి ఉంటుంది. ఇది తక్కువ విద్యుత్తులో వేడి నుండి ఉపశమనం ఇస్తుంది. చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా అన్ని ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ తప్పనిసరి. కానీ దానిని శుభ్రం చేయడం కూడా అంతే కష్టం. అందుకే ఈరోజు మేము మీకు సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి ఒక మంచి ఉపాయం చెప్పబోతున్నాం.. ఈ ట్రిక్‌ని పాటిస్తూ మీరు మీ ఫ్యాన్‌ని మళ్లీ కొత్తగా కనిపించేలా చేసుకోవచ్చు.

వారానికి ఒకసారి క్లీన్ చేయండి
సీలింగ్ ఫ్యాన్‌ని వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. ఎందుకంటే ఫ్యాన్‌లో దుమ్ము పేరుకుపోవడం వల్ల అది వెంటిలేషన్‌ను తగ్గిస్తుంది. వేడి గాలిని విసరడం ప్రారంభిస్తుంది. మీరు ప్రతి వారం ఫ్యాన్‌ను శుభ్రం చేస్తే, అది మురికిగా ఉండదు. మీ ఫ్యాన్‌ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది.

ఫ్యాన్ దుమ్మును శుభ్రపరిచేటప్పుడు మీరు ఒక పాత దిండు కవర్ తీసుకోండి.. ఇప్పుడు ఫ్యాన్‌ బ్లేడ్‌ను ఈ కవర్ లోపల తొడిగించి రెండు చేతులతో గట్టిగా రుద్దండి..ఆ తర్వాత దాన్ని బయటకు తీయండి. దీని వల్ల మురికి మొత్తం కవర్ లోపల పడిపోతుంది..

ఇవి కూడా చదవండి

ఫ్యాన్ కొత్తది కావాలంటే ఒక్క రూపాయి షాంపూ తీసుకుని అందులో అర టీస్పూన్ ఆవాల నూనె, అర గ్లాసు నీళ్లు కలపాలి. తర్వాత ఈ నీటిని స్పాంజితో బ్లేడ్‌పై అప్లై చేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత కాటన్ క్లాత్‌తో శుభ్రం చేస్తే ఫ్యాన్ కొత్తదిగా మారిపోతుంది.

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి మరొక పద్ధతి ఉంది. మీరు వైట్ వెనిగర్, డిష్వాష్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఫ్యాన్‌లో ఎలాంటి మరక పడితే వెంటనే శుభ్రం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..