Study: నెక్‌ టై ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదా.? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

నెక్‌ టై.. అనగానే ఒక ప్రొఫెషనల్‌ లుక్‌ గుర్తొస్తుంది. ఇంటర్వ్యూకు హాజరైన వారు, మంచి ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఇలాంటి నెక్‌ టైలను ఉపయోగిస్తారని తెలిసిందే. ఈ నెక్‌ టై మంచి లుక్‌ను తీసుకురావడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇది ధరించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.?

Study: నెక్‌ టై ధరించడం ఆరోగ్యానికి మంచిది కాదా.? అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Neck Tie

Updated on: Jul 13, 2024 | 3:13 PM

నెక్‌ టై.. అనగానే ఒక ప్రొఫెషనల్‌ లుక్‌ గుర్తొస్తుంది. ఇంటర్వ్యూకు హాజరైన వారు, మంచి ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఇలాంటి నెక్‌ టైలను ఉపయోగిస్తారని తెలిసిందే. ఈ నెక్‌ టై మంచి లుక్‌ను తీసుకురావడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అయితే ఇది ధరించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని మీకు తెలుసా.?

ఇదేదో ఫన్నీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధకులు అధ్యయనం చేపట్టిన తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. 2018లో నిర్వహించిన ఓ అధ్యయనంలో నెక్‌టై ధరించడానికి, అనారోగ్య సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో తేలిన వివరాల ప్రకారం.. నెక్‌టై ధరించడం వల్ల మెదడుకు రక్త ప్రవాహాన్ని 7.5 శాతం వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు.

దీనివల్ల మైకం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. టై గొంతుకు బిగుతుగా మారడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. ఈ పరిశోధన వివరాలను న్యూరోరోడియాలజీ అనే జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. పరిశోధనలో భాగంగా 30 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. వీరిని రెండు గ్రూపులుగా విభించారు. ఒక గ్రూప్‌ వారిని టై ధరించి ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేయించారు, మరొక గ్రూప్‌కు ఎలాంటి టై లేకుండా స్కాన్‌ చేయించారు.

నెక్‌ టై ధరించినప్పుడు ఒక నిర్ధిష్ట సమయంలో మెదడుకు ప్రవహించే రక్తంలో జరిగిన మార్పును గుర్తించారు. ఇక జర్మీనికి చెందిన పరిశోధకులు మూడు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లను నిర్వహించారు. ఇందులో ఒకటి ఓపెన్ కాలర్‌తో మెడకు నెక్‌టైని వదులుగా ధరించి, రెండోది కాలర్‌ బటన్‌ను, నెక్‌ టై బిగుతుగా ధరించి, ఒక మూఓది వదులుగా చేసి ఇలా మొత్తం మూడు స్కాన్‌లు నిర్వహించారు.

నెక్‌ టైని బిగుతుగా ధరించిన వారిలో మెదడుకు రక్త ప్రవాహం 7.5 శాతం తగ్గిపోయింది. అయితే నెక్‌ టై వదులుగా ఉన్న సమయంలో మెదడుకు రక్త ప్రవాహం పెరగడం ప్రారంభమైంది. అయితే మెదడుకు రక్త ప్రవాహం తగ్గడానికి మరెన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద మెడ ఉన్న వారిపై నెక్‌ టై ధరించడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై పరిశోధనల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే రక్త ప్రవాహం తగ్గడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందన్న దాని గురించి కూడా పరిశోధనల్లో సవివరంగా తెలపలేదు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఒక అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..