Blood Sugar: తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చట!

మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో డయాబెటీస్ కూడా ఒకటి అయితే.. తిన్న తర్వాత కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిను ఈజీగా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని ప్రముఖ నటుడు, దర్శకుడు పర్మీత్ సేథీ చెప్పుకొచ్చారు. తాను రోజూ తిన్న తర్వాత ఈ వ్యాయామాన్ని కచ్చితంగా చేస్తానని తెలిపారు. ఇంతకూ ఆ వర్కౌట్ ఏదో తెలుసుకుందాం పదండి.

Blood Sugar: తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చట!
Control Blood Sugar (1)

Updated on: Oct 07, 2026 | 9:34 AM

ప్రముఖ నటుడు, దర్శకుడు పర్మీత్ సేథీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్‌ సీక్రెట్‌ను పంచుకున్నారు. రోజూ రాత్రి తిన్న తర్వాత కాసేపు తాను నడకతో పాటు Calf Raises కూడా చేస్తానని తెలిపారు. ఈ వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే పర్మీత్ సేథీ అనుసరిస్తున్న ఈ వ్యాయామంపై థానేలోని కేఐఎంఎస్ హాస్పిటల్స్ ఎముకలు, కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ సారంగ్ దేశ్‌పాండే స్పష్టతనిచ్చారు. నిలబడి చేసే పిక్కల వ్యాయామం గ్యాస్ట్రోక్నిమియస్, సోలియస్ కండరాలను బలోపేతం చేయడానికి అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గమని తెలిపారు.

నడవడం, మెట్లు ఎక్కడం, శరీర సమతుల్యతను కాపాడుకోవడం వంటి రోజువారీ పనులకు ఈ కండరాలు ఎంతో అవసరం. వీటిని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల కాళ్లలో స్థిరత్వం, ఓర్పు పెరుగుతాయి. చూడటానికి ఇది చాలా సాధారణ వ్యాయామంలా కనిపించినా, సరైన పద్ధతిలో చేస్తే స్థిరమైన ఫలితాలు ఇస్తుంది అని డాక్టర్ దేశ్‌పాండే పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం వల్లే వీటిని రెండో మెదడు అని పిలుస్తారని ఆయన వివరించారు.

రక్తంలో చక్కెర నియంత్రణకు సమగ్ర మార్గం

అయితే రక్తంలో చక్కెర నియంత్రణపై స్పష్టమైన ప్రభావం కనిపించాలంటే కేవలం పిక్కల వ్యాయామం మాత్రమే సరిపోదని, దాంతో పాటు నడక, రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా ఏరోబిక్ వర్కౌట్లు వంటి ఇతర వ్యాయామాలను కూడా జత చేయాలని డాక్టర్ దేశ్‌పాండే సూచించారు. ముఖ్యంగా డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు నిరంతరం చురుగ్గా ఉంటూ, సమతుల్య ఆహారం తీసుకుంటూ, వైద్య సలహాలు పాటించడం కీలకమని తెలిపారు. అలాగే తక్కువ కదలికలు ఉండేవారు శారీరకంగా చురుగ్గా మారేందుకు ఇది ఒక ఉత్తమ మార్గమని చెప్పారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలు

ఈ వ్యాయామం వల్ల కండరాలకు టోనింగ్ మాత్రమే కాకుండా శరీరానికి అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయని డాక్టర్ తెలిపారు. బలమైన పిక్కలు చీలమండ కీలుకు పూర్తి మద్దతునిచ్చి, బెణుకులు వంటి గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని వివరించారు. శరీర భంగిమ, నడక తీరును మెరుగుపరుస్తాయని.. రన్నర్స్‌కు, క్రీడాకారులు లేదా ఎక్కువ సమయం పాటు నిలబడి పనిచేసే వారికి ఈ కండరాల బలం అత్యంత కీలకమన్నారు. క్రమంగా శరీర కదలికలు మెరుగై, కాళ్లలో అలసట గణనీయంగా తగ్గుతుందన్నారు.

సరైన పద్దతిలో చేయడం ఎలా

ఈ వ్యాయామం చాలా మందికి సురక్షితమైనదే అయినప్పటికీ, సరైన పద్ధతిని పాటించడం అత్యంత ముఖ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కదలికలు ఎప్పుడూ నెమ్మదిగా, నియంత్రణతో ఉండాలి. కాలి వేళ్లపై శరీరాన్ని పైకి లేపి, ఆపై మడమలను సున్నితంగా కిందికి దించాలన్నారు. చీలమండ, అకిలెస్ టెండన్ లేదా మోకాలి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలని సూచించారు. వ్యాయామం చేసే సమయంలో నొప్పి అనిపిస్తే వెంటనే ఆపివేసి వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

వేగంగా చేయడం వల్ల వ్యాయామ ప్రభావం తగ్గి, ఒత్తిడి పెరుగుతుంది. చాలా మంది మడమలను పూర్తిగా కిందికి దించకపోవడం వల్ల కండరాల పూర్తి సామర్థ్యం వినియోగం కాదని.. అలాగే గోడలు లేదా ఇతర వస్తువులను ఆధారం కోసం గట్టిగా పట్టుకోవడం వల్ల పిక్కలపై పడాల్సిన భారం తగ్గిపోతుందన్నారు

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us