ఈ జంతువు పాలతో బోలెడు ప్రయోజనాలు.. ఆరోగ్యవంతమైన అందంతో మెరిసిపోతారు..!

ఒంటె పాలు అరుదైనప్పటికీ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యునోగ్లోబులిన్‌లతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర నియంత్రణకు, గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని పెంచి, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి.

ఈ జంతువు పాలతో బోలెడు ప్రయోజనాలు.. ఆరోగ్యవంతమైన అందంతో మెరిసిపోతారు..!
Camel Milk Benefits

Updated on: Dec 20, 2025 | 9:11 PM

మీరు ఆవు పాలు, మేక పాలు, గాడిద పాల గురించి వినే ఉంటారు. కొంతమంది తాగి ఉంటారు కూడా. అయితే, ఒంటె పాలు దొరకడం చాలా కష్టం. కానీ వీటిని తాగితే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒంటె పాలలో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇన్‌ఫ్లేమేషన్ తగ్గుతుంది. ఆర్థరైటిస్, ఆస్తమా, అలెర్జీల వంటి లక్షణాలు తగ్గుతాయి. ఒంటె పాలలో ఇమ్యునోగ్లోబులిన్లు ఉంటాయి. వీటి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఒంటె పాలు విటమిన్లు సి, ఇ, అలాగే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఒంటె పాలలో ఇన్సులిన్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంచేందుకు దోహదం చేస్తుంది. ఒంటె పాలలో ప్రీబయోటిక్ ఒలిగోశాకరైడ్‌లు ఉంటాయి. దీని వలన గట్ హెల్త్ మెరుగవుతుంది. గట్ మైక్రోబయోమ్ మెరుగవుతుంది. ఒంటె పాలు తాగడం వలన ఆటిజం సమస్య తగ్గుతుందని కొన్ని అధ్యయానాల్లో వెల్లడైంది. ఒంటె పాలు తాగడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. తద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.

ఆవు పాలు, ఒంటె పాలలో పోషకాలు అధికం. కానీ ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలతో ఎక్కువ రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటును తగ్గించడంలో ఒంటె పాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే బీపీ ఉన్నవారు ఈ పాలు తాగడం మంచిది. ఒంటె పాలలో విటమిన్ సి ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు ఉన్నాయి. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. ఒంటె పాలను తాగడం ద్వారా నొప్పులు, వాపు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బాడీ పెయిన్స్‌తో బాధపడేవారికి ఇవి గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఒంటెపాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలోని పోషకాలు అనేక అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఒంటె పాలతో చర్మం సౌందర్యం మెరుగుపడుతుంది. ఇది చర్మం కణాల డ్యామేజ్ రిపేర్ చేసి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలకు దూరం చేస్తుంది. ఒంటె పాలలో కొల్లాజెన్, ఎలాస్టిన్, లానోలిన్ వంటి యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇవి తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చర్మానికి బలం, దృఢత్వం, స్థితిస్థాపకతను అందిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..