
ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఏసీల వాడకం విపరీతంగా పెరుగుతోంది. కొత్త ఏసీలు కొనలేని వారు తక్కువ ధరలో వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, సరిగ్గా చెక్ చేయకుండా పాత ఏసీలను వాడటం వల్ల అవి బాంబుల్లా పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏసీ పేలుళ్లకు కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు, యంత్రంలోని అంతర్గత లోపాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కంప్రెసర్ మీద అదనపు భారం పడటం, గ్యాస్ లీకేజీ, నాణ్యత లేని వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలుళ్లు జరుగుతాయి.
ఏసీ పైపుల వద్ద లేదా కంప్రెసర్ దగ్గర ఆయిల్ మరకలు ఉంటే అక్కడ గ్యాస్ లీక్ అవుతున్నట్లు అర్థం. గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు కంప్రెసర్ నిరంతరం పనిచేయాల్సి వస్తుంది, దీనివల్ల అది వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది.
పాత ఏసీలలో వైర్లు కాలిపోయి ఉన్నాయా లేదా జాయింట్లు ఎక్కువగా ఉన్నాయా అని చూడాలి. వదులుగా ఉన్న కనెక్షన్లు స్పార్కింగ్‌కు దారితీస్తాయి.
ఏసీ నడుస్తున్నప్పుడు అసాధారణమైన శబ్దాలు వస్తున్నా లేదా కాలిన వాసన వస్తున్నా దానిని వెంటనే ఆపివేయాలి. ఇది లోపల ఏదో పెద్ద సమస్య ఉందనడానికి సంకేతం. ఆ ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేశారో లేదో అడిగి తెలుసుకోవాలి. సరైన మెయింటెనెన్స్ లేని ఏసీలు ఎక్కువ విద్యుత్తును వాడటమే కాకుండా త్వరగా పాడవుతాయి.
పాత ఏసీని కొన్న వెంటనే నేరుగా వాడకుండా, ఒక నిపుణులైన మెకానిక్‌తో పూర్తి స్థాయిలో చెక్ చేయించాలి. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్ల మధ్య గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అవుట్‌డోర్ యూనిట్‌ను ఎండ నేరుగా తగలకుండా నీడలో ఉండేలా చూసుకోవడం మంచిది. ప్రాణాల కంటే తక్కువ ధర ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..