soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..

|

Mar 01, 2021 | 9:32 PM

రాత్రిళ్లు ఎక్కువగా రైస్ తినకుండా.. వేడి వేడి సూప్ తాగలాని చూస్తున్నారా ? దక్షిణ భారతంలో సూప్ తాగాడం చాలా అరుదు. అది కూడా నైట్ టైం. అయితే

soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..
Follow us on

రాత్రిళ్లు ఎక్కువగా రైస్ తినకుండా.. వేడి వేడి సూప్ తాగలాని చూస్తున్నారా ? దక్షిణ భారతంలో సూప్ తాగాడం చాలా అరుదు. అది కూడా నైట్ టైం. అయితే నైట్ టైం సూప్ తాగాడం వలన చాలా లాభాలున్నాయట.  అందులోనూ ఆకుకూరలతో చేసే సూప్ చాలా మంచిదట. ముఖ్యంగా బ్రోకలీ మరియు ఆకుకూరలతో నిండి ఉండే ఈ సూప్ లో క్రీమ్కు బదులుగా పెరుగును ఉపయోగించాలి. ఈ ఆరోగ్యకరమైన బ్రోకలీ సూప్ ను మీరు ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎందుకంటే అందులో అత్యధిక పోషకాలుంటాయి. మరీ ఆ సూప్ ఏలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు…

పెద్ద బ్రోకలీ హెడ్, చిన్న ఫ్లోరెట్లలో కత్తిరించాలి
కట్ చేసిన క్యారెట్లు- 2
కట్ చేసిన ఉల్లిపాయ- 1
చిన్నగా తరిగిన వెల్లుల్లి, లవంగాలు- 2
కప్పు బచ్చలికూర
పెద్ద బంచ్ – తాజా తరిగిన పార్స్లీ -1
సెలెరీ కాండాలు -2
పెరుగు 3 స్పూన్లు
ఉడకబెట్టిన కూరగాయల పులుసు 3 కప్పులు
ఉప్పు తగినంత
కొంచెం మిరియాల పొడి

తయారీ విధానం:

* ముందుగా ఒక ప్లేట్ తీసుకోని అందులో క్యారెట్లు, ఉల్లిపాయ, బచ్చలికూర, సెలెరీ కాండాలు, వెల్లుల్లి వేసి ఉడకబెట్టిన కూరగాయల పులుసును కలుపుకోవాలి.
* అన్నింటిని మొదట మీడియం ఫ్లేమ్‏లో కొంచెం సేపు ఉడకబెట్టి ఆ తరువాత 20 నిమిషాలు లౌ ఫ్లేమ్‎లో ఉడికించాలి.
* అదే మిశ్రమంలో బ్రోకలీ వేసి మరో ఐదు నిమిషాలు వేడిచేయాలి.
* అందులోనే పార్స్లీ, ఉప్పు, మిరియాలు వేసి హ్యాండ్ మిక్సర్ ఉపయోగించి క్రీంగా అయ్యే వరకు కలపాలి.
* తరువాత పెరుగు వేసి బాగా కలపాలి. ఈ సూప్ ను తీసుకోమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:

ఉపాది కల్పనకు పర్యాటక రంగమే ప్రధాన వనరు..జమ్ములో మార్పు తేవడానికి ఇదే సరైన మార్గం…

Proteins Foods: మీరు శాఖహారులా? ప్రోటిన్స్ ఎక్కువగా ఉన్న వెజిటెరియన్ ఫుడ్స్ ఎంటో తెలుసా..

జుట్టును వదిలేసి నిద్రపోతున్నారా ? మీ జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలెంటో తెలుసా ?