AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారికి చిన్న వయస్సులోనే పక్షవాతం వస్తుందంట..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు

మన బ్లెడ్‌ గ్రూప్ అనేది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మార్పిడికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పక్షవాతం వచ్చే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని తాజాగా పరిశోదనల్లో తేలింది. కాబట్టి ఇంతకూ రక్త రకాలు అనేవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.

ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారికి చిన్న వయస్సులోనే పక్షవాతం వస్తుందంట..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు
Blood Type Health
Anand T
|

Updated on: May 24, 2026 | 1:49 PM

Share

మన బ్లెడ్‌ గ్రూప్ అనేది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మార్పిడికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మన బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా పక్షవాతం వచ్చే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2022లో ప్రచురితమైన ఒక సంచలనాత్మక అధ్యయనం ప్రకారం, A బ్లెడ్‌ గ్రూప్ ఉన్నవారికి 60 ఏళ్ల లోపే పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య-శాస్త్రవేత్త మార్క్ గ్లాడ్విన్ ఈ పరిశోధనపై మాట్లాడుతూ, ఇది అత్యంత ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తి రక్త రకం ద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయడానికి మనకున్న జ్ఞానానికి ఇది మరింత బలాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు.

పరిశోధన ఏం చెబుతోంది

శాస్త్రవేత్తలు సుమారు 17,000 మంది పక్షవాత రోగులు, దాదాపు 6,00,000 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల డేటాతో కూడిన 48 జన్యు అధ్యయనాలను లోతుగా విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న వారందరూ 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కావడం గమనార్హం. ఈ జీనోమ్-వ్యాప్త శోధనలో శాస్త్రవేత్తలకు చిన్న వయసులోనే వచ్చే పక్షవాతానికి, రక్త రకాన్ని నిర్దేశించే జన్యువులకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ముఖ్యంగా A1 రక్త ఉప సమూహానికి కారణమైన జన్యువు ఉన్నవారిలో ఈ ప్రమాదం స్పష్టంగా కనిపించింది.

బ్లడ్ గ్రూపులను బట్టి ప్రమాద తీవ్రత

A గ్రూప్ ఉన్నవారిలో ఇతర రక్త రకాల వారితో పోలిస్తే, 60 ఏళ్ల వయస్సు రాకముందే పక్షవాతం వచ్చే అవకాశం 16 శాతం ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఇక B గ్రూప్ ఉన్నవారికి వయస్సుతో సంబంధం లేకుండా, స్ట్రోక్ రాని వారితో పోలిస్తే వీరికి పక్షవాతం వచ్చే అవకాశం 11 శాతం ఎక్కువ ఉన్నట్టు తేలింది. ఇక O గ్రూప్ ఉన్నవారికి ఇతరులకన్నా పక్షవాతం వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువ ఉంటుందని గుర్తించారు. అయితే A గ్రూప్ రక్తం ఉన్నవారిలో స్ట్రోక్ వచ్చే అదనపు ప్రమాదం ఎక్కువే అయినప్పటికీ, సాధారణ జీవితంలో ఇది చాలా స్వల్ప ప్రభావమే చూపుతుందని పరిశోదకులు చెబుతున్నారు. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రత్యేక స్క్రీనింగ్‌లు కూడా అవసరం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.

యువకుల్లో పక్షవాతానికి కారణం ఏంటి?

ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది అని వాస్కులర్ న్యూరాలజిస్ట్ స్టీవెన్ కిట్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద వయసు వారిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది. కానీ, యువకులలో పక్షవాతం రావడానికి రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన కారకాలే ముఖ్య కారణమని నిపుణులు తెలిపారు. A, B రక్త రకాల జన్యు క్రమాలు సిరలలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని, అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కొద్దిగా పెంచుతాయని గత అధ్యయనాలు కూడా నిరూపించాయి. రక్తం లోపలి ప్లేట్‌లెట్లు, రక్తనాళాల గోడలు, రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ప్రవర్తన వల్లనే A గ్రూప్ వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us