Health Tips: ఆ సమస్యలకు పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం.. మిరియాల నీళ్లు ప్రతిరోజూ తాగితే 30రోజుల్లో వచ్చే మార్పులివే..

సుగంధ ద్రవ్యాలైన మిరియాలలో పోషకాలతోపాటు.. అద్భమైన ఔషధ గుణాలు దాగున్నాయి.. అయితే.. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, బరువు తగ్గడానికి, మలబద్ధకం నివారణకు, చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.

Health Tips: ఆ సమస్యలకు పవర్‌ఫుల్ బ్రహ్మాస్త్రం.. మిరియాల నీళ్లు ప్రతిరోజూ తాగితే 30రోజుల్లో వచ్చే మార్పులివే..
Black Pepper Health Benefits

Updated on: Jan 31, 2026 | 4:13 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం.. మంచి జీవనశైలిని అవలంభించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అయితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మన వంటగదిలోనే అనేక అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో మిరియాలు (Black Pepper) ఒకటి.. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఒకటి ప్రతిరోజూ మిరియాల నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని గోరువెచ్చటి నీటిలో కలిపి నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక శారీరక మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మిరియాలలో ఎన్నో పోషకాలు..

మిరియాలలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు దాగున్నాయి. వీటిలో పైపెరిన్ (piperine) అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా.. విటమిన్లు A, K, E, C, ఐరన్, పొటాషియం, మెగ్నీషియ, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి..

మిరియాల నీళ్ల వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: మిరియాల నీళ్లు శరీర కణాలను పోషించి, ఫ్రీ రాడికల్స్, కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. రోగనిరోధక శక్తిని సులభ మార్గంలో పెంచడానికి బ్లాక్ పెప్పర్ ఒక ఉత్తమ మార్గమని చెబుతారు.

హానికర వ్యర్థాలను బయటకు పంపుతుంది: మన శరీర ఆరోగ్యం ప్రధానంగా పేగుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మిరియాలు కలిపిన గోరువెచ్చటి నీళ్లు శరీరంలోని వ్యర్థాలను, రసాయనాలను సమర్థవంతంగా బయటకు పంపి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

అధిక బరువు నియంత్రణ: మిరియాల నీళ్లు అధిక బరువును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, అధిక క్యాలరీలను ఖర్చు అయ్యేలా ప్రేరేపిస్తాయి.

చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది: నల్ల మిరియాల పొడి, వేడినీళ్ల మిశ్రమం పేగుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ కణాల పోషణకు కూడా తోడ్పడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతోపాటు.. సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

మలబద్ధకం నివారణ: దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు మిరియాల నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది పేగు కదలికలను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దారితీస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగించి, కడుపును తేలికపరుస్తుంది.

శక్తిని పెంచుతుంది: ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మిరియాల నీళ్లు తాగడం వల్ల జీవక్రియ బలం పుంజుకొని.. శరీర శక్తి రెట్టింపు అవుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ (డిటాక్సిఫై) చేస్తుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

మిరియాల నీటిని ఇలా తయారు చేసుకోండి..

ఈ మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే.. మిరియాలు ఘాటైన పదార్థం.. ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి.. కాబట్టి కేవలం ఒక చిటికెడు పొడిని మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువగా వినియోగిస్తే.. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చిటికెడు పొడిని నీటిలో వేసి మరిగించి.. తాగవచ్చు.. ఉదయాన్నే తాగితే ఫలితం ఉంటుంది.

ఎమైనా అనారోగ్య సమస్యలుంటే.. తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి..

నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలుంటే.. వైద్య నిపుణులను సంప్రదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..