Black Coffee: మహిళలకు ఓ వరం బ్లాక్ కాఫీ.. ఎలా, ఏ సమయంలో తాగడం వలన ప్రయోజనాలంటే..

రోజుని మొదలు పెట్టే ముందు లేదా పని మధ్యలో విరామం అవసరం అనిపించినప్పుడు వేడి వేడి కప్పు కాఫీ తాగితే.. ఆహా ఈ రోజు సుసంపన్నం అని భావిస్తారు కాఫీ ప్రియులు. ముఖ్యంగా ఇల్లు, ఉద్యోగం మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు.. బ్లాక్ కాఫీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు. వారికి తక్షణ శక్తిని ఇచ్చే ఒక పానీయం. ఈ రోజు మనం బ్లాక్ కాఫీ తాగడం వల్ల మహిళలు పొందే ప్రయోజనాల గురించి.. త్రాగడానికి సరైన సమయం గురించి తెలుసుకుందాం..

Black Coffee: మహిళలకు ఓ వరం బ్లాక్ కాఫీ.. ఎలా, ఏ సమయంలో తాగడం వలన ప్రయోజనాలంటే..
Black Coffee Benefits

Updated on: Jun 11, 2025 | 12:03 PM

చదువుతున్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు లేదా ఇంటి పనులు చేస్తున్నప్పుడు అలసిపోయే మహిళలు శక్తి కోసం టీ, కాఫీలను తాగడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ టీ కాఫీల కంటే బ్లాక్ కాఫీ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మెదడును అప్రమత్తంగా.. చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది సహజ శక్తిని పెంచుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. సోమరితనాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం

బ్లాక్ కాఫీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. వ్యాయామానికి ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది కొంత సమయం ఆకలిని కూడా అణిచివేస్తుంది. దీంతో అతిగా తినకుండా నిరోధించవచ్చు.

చర్మం, జుట్టుకు ప్రయోజనకరం

బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య సంకేతాలు ఆలస్యంగా కనిపిస్తాయి. జుట్టును బలంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది

మహిళలు అనేక బాధ్యతల కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. బ్లాక్ కాఫీ మూడ్ లిఫ్టర్‌గా పనిచేస్తుంది. ఇది మెదడులో “డోపమైన్” అనే హార్మోన్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును తేలికగా భావించేలా చేస్తుంది.

మధుమేహం, గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం

కొన్ని పరిశోధనల ప్రకారం బ్లాక్ కాఫీని పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు చక్కెర, క్రీమ్ లేకుండా తీసుకుంటే.. ఈ బ్లాక్ కాఫీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ తాగడానికి సరైన సమయం

  1. ఉదయం నిద్రలేచిన 1 గంట తర్వాత మీరు దీన్ని తాగవచ్చు.
  2. వ్యాయామానికి 30 నిమిషాల ముందు బ్లాక్ కాఫీని తాగవచ్చు.
  3. మధ్యాహ్నం నిద్ర వస్తుంటే బ్లాక్ కాఫీని తాగవచ్చు.
  4. రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ తాగకూడదు.

బ్లాక్ కాఫీ కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు. ఇది మహిళలకు ఆరోగ్య సహచరుడు కూడా. శక్తి, బరువు తగ్గడం లేదా మానసిక ఆరోగ్యం కోసం ఇలా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. అయితే దీనిని తాగడానికి సరైన సమయం, పరిమాణాన్ని తప్పనిసరిగా పాటించాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)