
జుట్టు తెల్లబడటం ఎవరికీ నచ్చదు. అందుకే చాలా మంది మార్కెట్ లో దొరికే డైలు, హెన్నా కలర్ లు వాడుతారు. అయితే ఇవి తాత్కాలికమే. ఎక్కువ కాలం వాడితే జుట్టు బలహీనపడుతుంది. కానీ సహజంగా జుట్టును నలుపుగా మార్చుకోవచ్చు. దీని కోసం ఆయుర్వేద పద్ధతులు చాలా ఉపయోగపడుతాయి.
నేల ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టులో కనిపించే వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి. అలాగే కరిసాలంకన్ని జుట్టుకు సహజ నలుపు రంగును తిరిగి తెస్తుంది. ఈ ఆయిల్ తయారీ పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు ఒక ఐరన్ పాన్ తీసుకొని కొబ్బరి నూనె వేసి వేడి చేయండి. అందులో పైన చెప్పిన రెండు పొడులను వేసి 5-7 నిమిషాలు మరిగించండి. పూర్తిగా మరిగిన తర్వాత చల్లారనివ్వండి. తర్వాత ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేయండి. అవసరమైనప్పుడు కొంచెం వేడి చేసి జుట్టుకు పట్టించి మర్దన చేయండి. రాత్రి పూట పట్టించి ఉదయం తలస్నానం చేయండి. ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
కరివేపాకులో ఉండే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు రూట్లను బలపరుస్తాయి, తెల్ల జుట్టును తగ్గిస్తాయి. ఈ ఆయిల్ ని ఎలా తయారీ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెను ఐరన్ పాన్ లో వేడి చేసి అందులో కరివేపాకు వేసి మరిగించండి. ఆకులు నల్లగా మారే వరకు ఉంచండి. చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనెను స్నానానికి 2 గంటల ముందు తలకు పట్టించి మర్దన చేయండి. వారానికి 2 సార్లు వాడితే జుట్టు నలుపుగా మారడంలో సహాయపడుతుంది.
హెన్నా జుట్టును బలంగా ఉంచుతుంది. ఇండిగో సహజంగా నలుపు రంగును ఇస్తుంది. ఈ రెండు కలిపి వాడితే జుట్టు నలుపుగా మారడంలో సహాయపడుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట హెన్నా పొడిని వేడి నీటిలో కలిపి పేస్ట్ చేసి 5 గంటలు ఉంచండి. తర్వాత తలకి అప్లై చేసి 2 గంటలు ఉంచి శుభ్రంగా కడగండి. అలాగే ఇండిగోను కూడా తయారు చేసి వాడండి. ఈ పద్ధతిని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగా నలుపుగా మారుతుంది.
ముందుగా హెన్నా పొడిని తగినంత వేడి నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను 5 గంటల పాటు పక్కన ఉంచండి. 5 గంటల తర్వాత ఈ హెన్నా పేస్ట్ ను మీ జుట్టుకు, ముఖ్యంగా తెల్ల జుట్టుపై బాగా అప్లై చేయండి. దీన్ని 2 గంటల పాటు జుట్టుపై ఉంచి ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి.
ఇప్పుడు ఇండిగో పొడిని కూడా తగినంత వేడి నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇందులో ఒక చెంచా కాఫీ పొడిని కలపండి. ఇది ఇండిగో రంగును మరింత స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పేస్ట్ ను వెంటనే (ఎక్కువ సమయం ఉంచకుండా) జుట్టుకు అప్లై చేయాలి.
ఇండిగో పేస్ట్ ను హెన్నా వేసిన తర్వాత శుభ్రం చేసిన జుట్టుకు పట్టించండి. దీన్ని కూడా 1 నుండి 2 గంటల పాటు ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో పూర్తిగా కడిగేయండి. షాంపూ వాడకుండా ఉండటం మంచిది. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మీ తెల్ల జుట్టు సహజంగా నలుపు రంగులోకి మారుతుంది. ఇది జుట్టుకు రంగును ఇవ్వడమే కాకుండా.. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)