అటుకులు తింటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Jun 23, 2023 | 7:52 PM

బరువు తగ్గడానికి కూడా అటుకులు చాలా బాగా ఉపయోగపడతాయి. వయసును బట్టి బరువు ఉండాలి. మీరు అధిక బరువుతో ఉండి, బరువు తగ్గడానికి రకరకాల నివారణలు ప్రయత్నిస్తుంటే, ఈసారి అటుకులను మీ ఆహారంలో భాగం చేసుకోండి. అటుకుల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వును కలిగించదు.

అటుకులు తింటే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Poha
Follow us on

భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దీంతో వివిధ రకాల వంటకాలు చేసుకుని తింటారు చాలా మంది. దీనిని ఎక్కువగా ప్రజలు పోహా అని పిలుస్తారు. చాలా మంది అల్పాహారంగా అటుకలను తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అటుకలతో చాలా రకాల స్నాక్స్ తయారు చేయడం చాలా సులభం. అటుకులు రుచికరమైనది మాత్రమే కాదు. శరీరానికి కూడా మేలు చేస్తుంది. అటుకుల్లో కార్బోహైడ్రేట్ జీర్ణమై పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గట్ ఆరోగ్యం క్షీణించినప్పుడు కడుపు సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు మీకు అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. దీనికి పరిష్కారంగా అటుకులు తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.

మధుమేహం ప్రస్తుత ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా సాధారణ సమస్యగా తయారైంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటుకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఎందుకంటే అటుకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర ప్రవాహాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అందుచేత ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం అవసరం. అటుకులు తినటం వల్ల ఐరన్ సమకూరుతుందని మీకు తెలుసా..? రక్తం తక్కువగా ఉన్న వారిలో రక్తహీనత వస్తుంది. అలాంటి వారు అటుకులను తింటే ప్రయోజనం కలుగుతుంది. గర్భిణీలకు కూడా అటుకులు చాలా మంచింది. గర్భధారణ సమయంలో శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, కాబట్టి దీనిని ఉపయోగించడం మంచిది. అంతేకాదు బహిష్టు సమయంలో అటుకులు తినడం కూడా చాలా మంచిది.

ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. స్థూలకాయం వల్ల శరీరం రకరకాల వ్యాధులకు గురవుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలని చెబుతారు. బరువు తగ్గడానికి కూడా అటుకులు చాలా బాగా ఉపయోగపడతాయి. వయసును బట్టి బరువు ఉండాలి. మీరు అధిక బరువుతో ఉండి, బరువు తగ్గడానికి రకరకాల నివారణలు ప్రయత్నిస్తుంటే, ఈసారి అటుకులను మీ ఆహారంలో భాగం చేసుకోండి. అటుకుల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది శరీరంలో కొవ్వును కలిగించదు.

ఇవి కూడా చదవండి

అటుకుల్లో ఫైబర్ ఉంటుంది. ఇది మీకు ఎక్కువసేపు ఆకలిని కలిగించదు. బరువు తగ్గాలంటే పావు ప్లేటు అటుకులు మాత్రమే తినాలి. అటుకులు అల్పాహారంగా మాత్రమే తినాల్సిన అవసరం లేదు, సాయంత్రం స్నాక్‌గా కూడా తినవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..