మఖానా, పాలు కలిపి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

పాలు, మఖానా కలిపి తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన పోషకాలను మఖానా, పాలు రెండు అందిస్తాయి. మఖానా నుండి కార్బోహైడ్రేట్లు, పాలలోని సహజ చక్కెరలతో కలిపినపుడు శక్తిని అందిస్తాయి. మఖానాలోని తక్కువ కేలరీలతో చేసే స్నాక్‌ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. పాలు, మఖానా రెండూ కలిపి తినడం..

మఖానా, పాలు కలిపి తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
మఖానాను పాలతో కలిపి తినేటప్పుడు మరీంకేమీ అందులో కలపవద్దు. పాలు, మఖానా మాత్రమే తీసుకోవాలి. చాలా మంది రుచిని పెంచడానికి అందులో చక్కెర కలుపుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు మరింత పెరుగుతారు.

Updated on: Nov 10, 2025 | 2:01 PM

పాలు మఖానా కలిపి తీసుకుంటే.. లెక్కలేనన్నీ హెల్త్‌ బెనిఫిట్స్ ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మఖానాలో ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు వంటి బహుళ పోషకాలు ఇందులో లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సులభంగా అందుతుంది. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. మఖానాలోని కార్బోహైడ్రేట్స్‌, పాలలోని సహజ చక్కెరలు శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి.

పాలు, మఖానా కలిపి తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్‌ ఒక్కసారిగా పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో మఖానా పాలను చేర్చుకోవాలి. ఇది తక్కువ కేలరీల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. పాలు, మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మఖానాలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనిని పాలతో కలిపినప్పుడు రెట్టింపు శక్తిని లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

పాలు, మఖానా కలిపి తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యానికి, నరాల పనితీరుకు, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన పోషకాలను మఖానా, పాలు రెండు అందిస్తాయి. మఖానా నుండి కార్బోహైడ్రేట్లు, పాలలోని సహజ చక్కెరలతో కలిపినపుడు శక్తిని అందిస్తాయి. మఖానాలోని తక్కువ కేలరీలతో చేసే స్నాక్‌ బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. పాలు, మఖానా రెండూ కలిపి తినడం మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే జీర్ణక్రియ సులభంగా అవుతుంది.

గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా మఖానా సహకరిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం కారణంగా ఇది రక్తపోటు స్థాయిలను నియత్రిస్తుంది. మెదడు పనితీరుకు మేలు చేస్తుంది. పాలలోని ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఏకాగ్రతను పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. మఖానా తక్కువ గ్లైసెమిక్ చక్కెరను విడుదల చేస్తుంది. పాలలో విటమిన్ A,E ఆక్సీకరణ ఒత్తిడిని సహకరిస్తాయి. మఖానాను పాలలో కలిపి తీసుకోవడం వల్ల వాపు, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది.

మఖానా పాలు శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. మీరు రోజంతా పని ఒత్తిడితో అలసిపోతే ఈ పాలు తాగడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. మఖానాలో కెంఫరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. పాలలోని విటమిన్ ఈ, ఎలు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..